టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు, తన తండ్రి కృష్ణ నటవారసత్వంతో చిన్నతంలోనే పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఆ వయసులోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మహేష్, బాలచంద్రుడు సినిమాతో విరామం తీసుకుని, ఆపై కొన్నేళ్ల గ్యాప్ అనంతరం రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టిన సూపర్ స్టార్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో ముందుకు దూసుకెళ్లారు. ఇక చిన్నతనం నుండి ఎంతో చలాకీగా ఉండే మహేష్ బాబు, చిన్నవయసులోనే తన సినిమాల్లోని పలు సాంగ్స్ లో ఆకట్టుకునే డ్యాన్స్ ని ప్రదర్శించడం జరిగింది. 

IHG

ఇక పెరిగి పెద్దయి హీరో అయ్యాక, మొదట కొన్ని సినిమాల్లో మహేష్ మంచి డ్యాన్స్ మూమెంట్స్ చేసేవారు. కొన్నేళ్ల క్రితం నుండి తన డ్యాన్స్ ల పై పెద్దగా శ్రద్ధ పెట్టని మహేష్ బాబు, మళ్ళి ఇటీవల కొన్నాళ్లుగా తన సినిమాల్లో మంచి డ్యాన్స్ మూమెంట్స్ ని ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే సరిగ్గా ఆరేళ్ళ క్రితం వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులోని సాంగ్స్ మాత్రం శ్రోతల నుండి మంచి పేరు దక్కించుకోవడం జరిగింది. 

 

మరీ ముఖ్యంగా సినిమాలోని ఒక కీలక సందర్భంలో వచ్చే సయనోరా సాంగ్ లో మహేష్ బాబు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ వేయడం జరిగింది. ఆ సినిమా కోసం ఒకింత సన్నబడ్డ మహేష్, ఆ సాంగ్ లో డ్యాన్స్ లు మరింత ఈజ్ తో చేసారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తొలిసారిగా ఈ సినిమా ద్వారా మహేష్ సినిమాకు పని చేసారు. దేవి అందించిన మంచి ట్రెండీ స్టైల్ ఫాస్ట్ బీట్ కు మహేష్ బాబు వండర్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తోడై ఆ సాంగ్ ని థియేటర్స్ లో ఫ్యాన్స్ తో విపరీతంగా విజిల్స్ కొట్టించింది. ఆ విధంగా మరొక్కసారి డ్యాన్స్ తో కూడా తన ఫ్యాన్స్ ని ఖుషి చేసారు సూపర్ స్టార్ మహేష్.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: