బిగ్ బాస్ సీజన్ త్రీ లో హైలెట్ అయిన జోడి ఎవరు అంటే ఖచ్చితంగా అందరూ చెప్పేది రాహుల్ సిప్లిగంజ్ మరియు పునర్నవి ల జంట. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత రోజులు చాలా క్లోజ్ గా ఉండటంతో పాటు చిన్న చిన్న గొడవలు మరియు అల్లరి చేష్టలు ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించారు వీరిద్దరు. ఇక రాహుల్ మరియు పునర్నవి క్లోజ్ నెస్ చూసి చాలామంది  ప్రేమలో పడ్డారు హౌస్ నుండి బయటకు వచ్చాక ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అని అందరూ భావించారు. అయితే వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ బిగ్బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక చాలా సార్లు బయట కొలుస్తూ పార్టీలో ఉంటూ మరి కొన్ని సార్లు కొన్ని టీవీ ఛానల్స్  కి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది.

 

అయితే ఇలాంటి వార్తలు భయంకరంగా వస్తున్న తరుణంలో చాలాసార్లు ఇద్దరు మా మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు అని చాలాసార్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. మరోపక్క అభిమానులు మాత్రం వీళ్లిద్దరి రిలేషన్ పై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే మొన్నామధ్య వరకు బాగానే కనిపించిన ఈ బిగ్బాస్ జోడి ఈమధ్య అసలు ఏ సందర్భంలోనూ సరిగా కనిపించడం లేదు. రాహుల్, వరుణ్ మరియు వితిక పార్టీలు చేసుకుంటున్న గాని పునర్నవి మాత్రం వీరితో కలవటం లేదు. ఇదిలావుంటే ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ చేసిన వ్యాఖ్యలు పునర్నవి తో గొడవలు జరిగినట్టు ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు.

 

పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ అభిమానులతో చిట్ చాట్ చేయడం జరిగింది. దీంతో స్టార్ట్ చేయటమే చాలామంది అభిమానులు పునర్నవి తో రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా వెంటనే రాహుల్ సిప్లిగంజ్ సీరియస్ అయిపోయాడట. అసలు ఆమెకు ఎలాంటి రిలేషన్ లేదని బిగ్ బాస్ హౌస్ వరకు ఫ్రెండ్స్ అని బయట ఎవరి జీవితాలు వారికి ఉంటాయి చాలా సీరియస్ గా తెలపడం జరిగిందట. స్క్రీన్ మీద జీవితం వేరు రియాలిటీ లో జీవితం వేరు అని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: