స్మాల్ స్క్రీన్ క్రేజీ జోడీ సుడిగాలి సుధీర్, రష్మిల హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. షో ఏదైనా సరే వీరిద్దరు కనిపిస్తే చాలు.. షో సూపర్ హిట్ అన్నట్టే లెక్క. రష్మి ఛీ కొడుతున్నా ఆమె ప్రేమకోసం వెంటపడే సుధీర్.. అతని తన వెంట కావాలని తిప్పుకునేలా రష్మి ప్రవర్తన. ఇదంతా ఓ స్కిట్ లా చేసినా వాళ్లిద్దరి కాంబో అంటేనే సూపర్ హిట్ అవుతుంది. అయితే షోలో వాళ్ల క్లోజ్ నెస్ చూసి యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు రాసుకుంటారు. ఆ విషయం పక్కన పెడితే సుధీర్, రష్మిల జోడీతో బుల్లితెర మీద హంగామా సక్సెస్ అవుతుంది. అందుకే వీళ్లిద్దరిని వెండితెర మీద కూడా జోడీ కట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

సుధీర్ హీరోగా చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మినే అనుకున్నాడట నిర్మాత్ రాజు. కాని రష్మి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ధన్యని తీసుకున్నారు. అయితే సుధీర్ నెక్స్ట్ సినిమాలో రష్మి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. బుల్లితెర మీద వారిద్దరి జోడీ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి అదే ఫార్ములా సిల్వర్ స్క్రీన్ పై కూడా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు.

 

సుధీర్ హీరోగా రష్మి హీరోయిన్ గా చేస్తే.. ఇన్నాళ్లు షోలో డైలాగ్స్, డ్యాన్స్ లతో సరిపెట్టిన ఈ ఇద్దరు ఇక సినిమాలో రొమాన్స్ కూడా రెచ్చిపోతారు. స్మాల్ స్కీన్ పర్ఫెక్ట్ జోడీగా క్రేజ్ తెచ్చుకున్న సుధీర్, రష్మి వెండితెర మీద జోడీ కడితే ఇక ఆ రచ్చ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇంతకీ వారు కలిసి చేసే సినిమా డీటైల్స్ ఏంటి.. ఆ సినిమాకు డైరక్టర్ ఎవరు అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: