కరోనా భయంతో ఆగిపోయిన సినిమా షూటింగ్ లను మొదలుపెట్టాలని ఈలిస్టులో తన ‘ఆచార్య’ ను ముందువరసలో పెట్టి ఇండస్ట్రీలోని హీరోలకు సాంకేతిక నిపుణులకు ఆదర్శంగా నిలవాలని చిరంజీవి ఎన్నో సమావేశాలు రాయబారాలు ప్రయత్నాలు చేసాడు. అయితే ప్రస్తుతం చిరంజీవి వయసు 65 సంవత్సరాలు కావడంతో పంతంతో కరోనా తో యుద్ధం చేయడం మంచిదికాదు అన్నసలహాలు రావడంతో చిరంజీవి వెనకడుగు వేసి తన ‘ఆచార్య’ షూటింగ్ ను వాయిదా వేసాడు.


అయితే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మాత్రం తన మామగారు చిరంజీవి చేయలేని సాహసాన్ని చేసి ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోలకు ఆదర్శ ప్రాయంగా నిలబడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గ మారింది. కళ్యాణ్ దేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సూపర్ మచ్చి’ షూటింగ్ ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులలో కూడ నిరాటంకంగా కొనసాగుతూ అందరికీ షాక్ ఇస్తోంది.


ఈమూవీ షూటింగ్ గురించి కళ్యాణ్ దేవ్ ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు వల్ల తాను షూటింగ్ లో పాల్గొని నటించగలనా అని భయపడ్డానని అయితే తన ధైర్యం తన భయాన్ని తరిమి వేసింది అని అంటున్నాడు.


షూటింగ్ పూర్తి అయ్యేవరకు కరోనా కు సంబంధించిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ తన మేకప్ తానే చేసుకుంటూ తన ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ను మాత్రమే తింటూ ఒక్క షూటింగ్ సమయంలో తప్ప మిగతా సమయం అంతా పిపిఇ కిట్స్ వేసుకుంటూ కరోనా తో యుద్ధం చేస్తున్న విషయాన్ని వివరించాడు. అంతేకాదు తాను షూటింగ్ లో పాల్గొనడం వల్ల తన భార్య పిల్లలకు ఎటువంటి వైరస్ సోకకుండా తాను తన ఇంటిలో వేరే గదిలో ఉంటున్న విషయాన్ని కూడా కళ్యాణ్ దేవ్ వివరించాడు. తన మామగారు చిరంజీవి ఇచ్చిన సలహాలు ప్రోత్సాహంతో తాను ధైర్యంగా ‘సూపర్ మచ్చి’ షూటింగ్ లో పాల్గొంటున్నాను అని అంటున్నాడు. మెగా కుటుంబంలోని ఏహీరో చేయని సాహసం ఇప్పుడు కళ్యాణ్ దేవ్ చేయడంతో చిరంజీవి కేవలం మాటలకే పరిమితం అయితే కళ్యాణ్ దేవ్ చేతలతో చూపిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో ఆశ్చర్యపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: