నాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా వి. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. నాని ఈ సినిమాలో పూర్తిస్థాయి నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడన్నమాట. సినీఅలో నివేదా థామస్, అదితి రవు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అష్టా చమ్మ, జెంటిల్మెన్ సినిమాల తర్వాత డైరక్టర్ ఇంద్రగంటి, హీరో నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా వి.

 

ఇక ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. థియేటర్లు ఇప్పుడప్పుడే తెరచుకునే పరిస్థితి కూడా కనబడటం లేదు. అందుకే మినిమం, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. అయితే తమ సినిమా సెల్ ఫోన్ లో చూసే సినిమా కాదని వి డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. అయినా సరే అహా, అమేహాన్ వి సినిమాకు 30 కోట్ల దాకా ఆఫర్ ఇచ్చారట.

 

నిర్మాత దిల్ రాజు మీద ప్రెజర్ ఉండటంతో సినిమాను ఓటిటి రిలీజ్ చేయాలని అంటున్నాడట. కాని నాని మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. థియేటర్లు ఓపెన్ అయ్యాకనే సినిమా రిలీజ్ చేయాలని చెబుతున్నాడట. నాని నిర్ణయం మీదనే ఓటిటి లో వి రిలీజ్ ఉంటుందా లేదా అన్నది ఉంటుంది. మొత్తానికి నాని, సుధీర్ బాబుల వి రిలీజ్ పై మళ్లీ ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తుంది. రెండు జన్మల కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు ఒక జన్మలో విలన్ గా మరో జన్మలో హీరోగా కనిపిస్తాడట. సుధీర్ బాబు రోల్ కూడా సినిమాలో నానికి ఈక్వల్ గా ఉంటుందట. మొత్తానికి నాని వి సరికొత్త సంచలనాలు సృష్టిస్తుందని మాత్రం చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: