బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం బాలీవుడ్ లోని వారసత్వంపై చర్చకు దారి తీసింది. బాలీవుడ్ లో వారసులుగా వస్తున్న హీరోలు, హీరోయిన్లు చాలా ఎక్కువే. అయితే బంధుప్రీతి వల్ల ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారి అవకాశాలని లాగేసుకుంటున్నార్ని, వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆన్ లైన్ వేదికగా వారసత్వంగా వచ్చినవారిపై అనేక విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణం ఇండస్ట్రీలో తనకి అవకాశాలు రాకుండా చేయడమే అనీ, అందువల్లే అతను డిప్రెషన్ లోకి వెళ్ళాడని అంటున్నారు.

IHG

 

బాలీవుడ్ లోని బంధుప్రీతిపై ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు నోరు విప్పారు. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా నెపోటిజంపై తనదైన వ్యాఖ్యలు చేసింది. నెపోటిజం, బంధుప్రీతి ఇండస్ట్రీలో ఉన్న మాట నిజమే అని, ఆ మాటకొస్తే ఇండస్ట్రీలోనే కాదు ప్రతీ  ఫీల్డ్ లో ఉందని, దాన్ని కాదనలేమని.. అలా అని టాలెంట్ ఉన్న వారికి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని, అలా అవకాశాలు అందుకుంటూ ఎదిగిన వారిలో షారుఖ్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్ వంటి వారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారని గుర్తుచేసింది.

IHG

 

వారసత్వం అనేది మన చేతుల్లో లేదని, రేపు నా కొడుకో, కూతురో ఇండస్ట్రీలోకి వస్తామంటే మనం ఆపగలమా అంటూ ప్రశ్నించింది. అయినా అందులో ఎలాంటి తప్పు లేదంటుంది. మొత్తానికి బాలీవుడ్ వారసత్వంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమన్నా వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: