మన తెలుగు సినీ పరిశ్రమలో డాన్స్ అనగానే చాలా మంది చెప్పే పేరు చిరంజీవి. ఆయన డాన్స్ ని చూసి బాలీవుడ్ లో కూడా ఫిదా అయిపోయే వారు జనాలు. ఆయన డాన్స్ చూడటానికి ఆయన పాటలను ఇప్పటికి కూడా కూడా చూస్తూ ఉంటారు. ఇక ఆయన టాలీవుడ్ కి బ్రేక్ డాన్స్ ని పరిచయం చేసారు. ఆయనను తెలుగు మైకేల్ జాక్సన్ అని కూడా అన్నారు అంటే ఆయన రేంజ్ లో డాన్స్ విషయంలో ఆకట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ తరంలో ఆయన తో పోటీ పడి డాన్స్ చేసే వారు లేరు అనే చెప్పాలి. ఆయన సినిమా వస్తుంది అంటే మాస్ కి ఆయన డాన్స్ కోసమే వెళ్ళే పరిస్థితి. 

 

ఇక ఆయన తనలో ఉన్న డాన్సర్ కోసం చాలా కష్టాలు పడే వారు అని అంటారు. ఆయన ఫిట్నెస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారు అని ఏది పడితే అది తినే వారు కాదు అని అంటారు. ఒక సినిమా ఉంది అంటే ఆ సినిమా అయ్యే  వరకు కూడా ఆయన చాలా ఇష్టాలను చంపుకునే వారు అని ఆ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి చేసే వారు అని చెప్తారు. ఈ తరంలో అలాంటి హీరోలు చాలా తక్కువ. తన డాన్స్ చూసి ఎక్కడా కూడా విమర్శకులు అవకాశం తీసుకోవద్దు అనే భావన లో ఆయన ఉంటారు అని చాలా మంది అంటారు. 

 

అందుకే డాన్స్ విషయంలో ఆయన ముందు నుంచి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చాలా వరకు డాన్స్ లో కష్టపడ్డారు. ఆయన తో డాన్స్ అనగానే హీరోయిన్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తారు. ఆ రేంజ్ లో ఆయన డాన్స్ చేసే వారట

మరింత సమాచారం తెలుసుకోండి: