మన తెలుగు లో మహేష్ బాబు కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలు ఆయన నటన ఆయనకు వచ్చిన స్టార్ ఇమేజ్ గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయన ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాలో ఆయన నటన ఎంత బాగా హైలెట్ అవుతుందో ఆయన డాన్స్ కూడా అదే రేంజ్ లో హైలెట్ అవుతుంది అని చాలా మంది ఆయన ఫాన్స్ తో పాటుగా ఇతర సినీ ప్రేక్షకులు కూడా పదే పదే అంటూ ఉంటారు. డాన్స్ కి మహేష్ బాబు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అయితే కెరీర్ మొదట్లో మాత్రం మహేష్ డాన్స్ విషయంలో ఆ రేంజ్ లో శ్రద్ధ అనేది చూపించలేదు అని అంటారు. 

 

అవును కెరీర్ మొదట్లో నటన విషయంలో మాత్రమే మహేష్ దూకుడు చూపించాడు గాని డాన్స్ విషయంలో వన్ సినిమా తర్వాతే  అతను చాలా వరకు జాగ్రత్తలు పడ్డాడు అని ఆయన సినిమాలు చూసిన అందరికి కూడా అర్ధమవుతుంది. ఆయన సినిమాల్లో డాన్స్ అప్పటి నుంచే ఎక్కువగా హైలెట్ అయింది అని చెప్పాలి. ఇప్పుడు డాన్స్ విషయంలో మహేష్ బాబు చాలా వరకు ప్రాక్టీస్ చేయడమే కాకుండా తన లో తాను చాలా మార్పులు చేసుకుని డాన్స్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. స్టార్ హీరో గా ఉన్న సరే డాన్స్ విషయంలో మహేష్ బాబు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సిఎం కొడుకు గా నటించే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: