త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రిప్టు, దాన్ని వెండి తెరపై చూపించిన విధానం అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలోని మాటల మాంత్రికుడు డైలాగులకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు.


సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా రాములు రాముల, బుట్ట బొమ్మ, సామజ వర గమన పాటలు యూట్యూబ్ లో పెద్ద సంచలనం సృష్టించాయి. సినిమా విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో గడిచిన దశాబ్దంలో అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు. 2019 వరకు సరైన కథాబలం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకోలేక కేవలం డ్యాన్స్ ఉంటే సరిపోతుంది కదా అని అల్లు అర్జున్ ఎన్నో సినిమాలను తెరకెక్కించి అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయంతో ఎట్టకేలకు ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ను తన అభిమానులకు ప్రసాదించి ప్రశంసలను దక్కించుకున్నాడు.


పూజా హెగ్డే ని నిజంగా బుట్ట బొమ్మ లాగానే చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆమె ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే అల్లు అర్జున్ సరసన అత్యద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నది. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ లో ఆమె అచ్చం బొమ్మలాగానే వేసిన స్టెప్స్ లకు యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. బుట్ట బొమ్మ పాట కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా... అల్లు అర్జున్ దాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించాడు. నిజానికి అల్లు అర్జున్ మంచి డాన్సర్. జానీ మాస్టర్ ఇలా వేయాలి అని చేసి చూపిస్తే... అల్లు అర్జున్ దాన్ని సూపర్ స్టైలిష్ గా మార్చేసి తన మొహం లో అద్భుతమైన హావభావాలు పలికించి డాన్స్ మాస్టర్లనే అబ్బురపరిచాడు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: