కొన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి స్టార్ హీరో చారిత్రక యోధుల పాత్రలలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా చారిత్రక యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. గతంలో రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే చారిత్రక యోధుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి స్టార్ హీరో చారిత్రక యోధుల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుత నటుడు రామ్ చరణ్ కూడా అద్భుతంగా ఒదిగిపోతాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
వీరంతా చారిత్రక యోధుల పాత్రలో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ కూడా వారి అడుగులోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తను కూడా విరూపాక్ష సినిమాలో చారిత్రక యోధుడు అయిన పండుగ సాయన్న పాత్రలో నటించబోతున్నాడు. ఏది ఏమైనా చరిత్రలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రజాదరణ పొందిన రియల్ హీరోలను వెండి తెరపై చూపించడానికి ఎక్కువ పాపులారిటీ కలిగిన మెగాఫ్యామిలీ చేస్తున్న ప్రయత్నాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మెగా హీరోలు చారిత్రక యోధుల పాత్రలను వేయడం వలన నేటి తరం యువతకు మనం పుట్టిన దేశం కోసం వారు చేసిన సాహసాలు, త్యాగాలు తెలుస్తాయి.
Powered by Froala Editor