ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు పరిచయమైన విషయం తెలిసిందే, దాదాపుగా అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా కొనసాగుతున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా తమదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తున్నారు అనే చెప్పాలి. ఎవరికి వారు తమదైన శైలిలో డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ... మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 

 

 ఇలా తనదైన నటన తో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో మెగా హీరో ల్లో మంచి గుర్తింపు సంపాదించుకు న్న హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి నుంచి తన సినిమా ల్లో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నే ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఎన్నో సినిమా ల్లో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లు  చేసి ప్రేక్షకులను ఎంతగా నో ఆకట్టుకున్నపటి కి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన పాట మాత్రం సుప్రీం సినిమా లో ని అందం హిందోళం పాట. 

 

 మామూలుగానే సాయి ధరంతేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించి న సినిమా నుంచి హిట్ సాంగ్స్ ని తీసుకుని వాటిని రీమేక్ చేస్తూ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో  తెలుగు ప్రేక్షకుల ను ఆకట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే మెగాస్టార్ సాంగ్ అయిన అందం హిందోళం అనే పాటను సుప్రీమ్ సినిమా లో  రీమేక్ చేసాడు సాయి తేజ్. ఇక ఈ పాట లో రాసీఖన్న తో కలిసి సాయి తేజ్  వేసిన స్టెప్పు లు  తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి అని చెప్పాలి. ఇక ఈ పాట కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: