ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ హీరోలు ఇంకెంతో మంది హీరోలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు హీరోలు డాన్స్ లపై శ్రద్ధ చూపక పోయేది కానీ నేటి తరంలో మాత్రం ప్రతి ఒక్క హీరో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీస్తున్నాడు . అదే సమయంలో సీనియర్ హీరోలలో డాన్స్ లకు దూరంగా ఉన్న హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అదిరిపోయే స్టెప్పులు వేయక పోయినప్పటికీ ఆసక్తికర స్టెప్పులతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చిన్న స్టెప్స్ వేసిన అభిమానులు చూసి మురిసిపోతూ వుంటారు.
అందుకే పవన్ కళ్యాణ్ పాటల్లో చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా అభిమానుల్లో మాత్రం ఆ స్టెప్స్ తెగ క్రేజీ సంపాదిస్తూ ఉంటాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ ల తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన పాట ఏదైనా ఉంది అంటే అది గబ్బర్ సింగ్ సినిమాలోని టైటిల్ సాంగ్. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అంటూ సాగిపోయే సాంగ్ లో పవర్ స్టార్ ఎంతో సింపుల్ స్టెప్స్ వేసి తనదైన ఆటిట్యూడ్‌తో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించారు అని చెప్పాలి. అయితే ఆ పాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది ఎంతో సింపుల్ స్టెప్ అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ గా మారిపోయింది.
ఇప్పటికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో గబ్బర్ సింగ్ పాట లోని పవన్ కళ్యాణ్ స్టెప్స్ ని ప్రయత్నిస్తూనే ఉంటారు యువ హీరోలు. ఒక్కసారి యువ హీరోలు పవన్ కళ్యాణ్ స్టెప్ వేశారంటే చాలు ప్రేక్షకులు అందరూ ఈలలు గోలలతో హోరెత్తి పోతూ ఉంటారు. అంతలా ఆ పాటలోని స్టెప్స్ తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా నడుము దగ్గర చేయి పెట్టి పవన్ కళ్యాణ్ చేసే స్టెప్ అయితే ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ గా నిలిచింది అని చెప్పాలి. యువ హీరోలు ఎంతో కష్టమైన స్టెప్స్ వేసినప్పటికీ దక్కని క్రేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ సింపుల్ స్టెప్ తో దక్కించుకున్నారు.