తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి డాన్సులతో ఊపేస్తున్న హీరో ఎవరూ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి ఓవైపు నటనతో ప్రేక్షకులను మెప్పించడమే  కాదు... అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని సరికొత్త డాన్స్ పర్ఫార్మెన్స్ లను చూపించే మరింతగా ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ స్టైల్ ని  ఇప్పటికి కూడా ఏ హీరో బీట్ చేయలేడు  అనడంలో అతిశయోక్తి లేదు. తనదైన డాన్సులతో తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. 


 అయితే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో  అదరగొట్టిన సాంగ్ లు ఎన్నో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా పాటల్లో  మెగాస్టార్ చేసిన స్టెప్పులు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాయి. ఇక ఇలా మెగాస్టార్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ లలో బాగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి ముఠామేస్త్రి సినిమా లోని హోయ్ రబ్బా పాట. ఈ పాట ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అనే చెప్పాలి. ఈ పాటలు చిరంజీవి డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 


 ఈ పాటలో డాన్స్ పర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసారు  మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ పాటలోనే ఎన్నో స్టెప్స్ ని  ఇప్పటికి కూడా యువహీరోలు ఫాలో అవుతున్నారు అంటే ఈ పాటలో మెగాస్టార్ వేసిన స్టెప్పులు ఎంతలా ప్రభావితం చేశాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా లుంగి పైకెత్తి కట్టి హోయ్ రబ్బా అంటూ ఎంతో  స్టైల్ గా ముందుకు నడుచుకుంటూ వెల్లి బాడీ వేవ్ మూమెంట్ తో చేసే స్టెప్  అయితే నేటి తరం ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అయితే ఈ పాటలోని  స్టెప్స్ ని ఎంతో మంది ట్రై చేసినప్పటికీ ఎవరికి మాత్రం మెగా స్టార్ స్టైల్ కానీ ఆటిట్యూడ్ కానీ రాలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: