టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన చిత్రం `సరైనోడు`.  గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లు న‌టించారు. బన్నీని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసిన‌ సినిమా ఇది. ఇర బోయ‌పాటి గతంలో తెరకెక్కించిన చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు. మాస్ ను మెప్పించే హై ఓల్టేజ్ ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ మూవీ ఇది. 

IHG

మాస్ కు నచ్చే  యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అలాగే  ఒక మాస్ పాత్రలో నటించగలనని ఋజువు చేసుకున్న బన్నీ కూడా ఈ సినిమాకు హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. యాక్టింగ్‌లో, డైలాగ్ డెలివరీలో, స్టైల్‌లో అన్నింటా బన్నీ కట్టిపడేశాడు. మ‌రియు బన్నీ తన ఎనర్జీ పరంగా ఎక్కడా డ్రాప్ కాలేదు. ఇక  బ‌న్నీ డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మరో పదేళ్ళు పూర్తయినా.. డ్యాన్స్ అనగానే అందరికీ బన్నీ పేరే గుర్తొస్తుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా చెరగని ముద్ర వేసేశాడు బన్నీ.

IHG

ఇక స‌రైనోడు సినిమాలో ముఖ్యంగా ఐటెం సాంగ్‌ ‘బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టరే’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సాంగ్‌లో బ‌న్నీ రెచ్చిపోయాడ‌నే చెప్పాలి. ఎంత స్పీడుగా చేసినా... స్టైలు, గ్రేసు ఎక్క‌డా మిస్ కాకుండా.. ఊర మాస్ స్టెప్పులేశాడు బ‌న్నీ. ఈ సాంగ్‌లో బ‌న్నీ డాన్స్ చేస్తుంటే చాలా మంది అలా చూస్తూ ఉంటారు. అంత‌లా బ‌న్నీ డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అలాగే ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ స‌ర‌స‌న అంజ‌లి అద్భుతంగా ఆడిపాడింది.
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: