ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథాంశాల్లో సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా ఉంటాయి. ఈ తరహా సినిమాలకు ఆదరణ కూడా ఎక్కువే. కథ, టేకింగ్, స్క్రీన్ ప్లే బాగుంటే.. సస్పెన్స్ రివీల్ అయిపోయిందని తెలిసినా రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఇటువంటి సినిమాలకు. ఆ తరహాలో తెలుగులో తెరకెక్కిన సినిమానే ‘అనుకోకుండా ఒక రోజు’. ‘ఐతే’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించే కథాంశమే ఈ సినిమా బలం.

IHG

 

ఛార్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2005 జూలై 3వ తేదీన విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లరే అయినా కొత్త తరహా కన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. చార్మీ నటన సినిమాలో ఆకట్టుకుంటుంది. సింగర్ కావాలనుకునే అమ్మాయి జీవితంలో అనుకోకుండా ఓ రోజు మిస్ అయిపోతుంది. ఆ విషయం తనకు ఏమాత్రం తెలీదు.. గుర్తు రాదు. ఇదే ఈ సినిమా కాన్సెప్ట్. తన ఆలోచనలతో చంద్రశేఖర్ అద్భుతమే చేశాడు. సినిమాలో అన్ని అంశాలను జోడించి తన మార్క్ చూపించాడు చంద్రశేఖర్ ఏలేటి.

IHG

 

సినిమాలో జగపతిబాబు కీలకం. టెక్నికల్ గా సినిమాకు మేజర్ ఎస్సెట్స్ గా నిలిచారు కీరవాణి, సిరివెన్నెల. ఆహ్లాదకరమైన ట్యూన్స్ తో కీరవాణి ఆకట్టుకుంటే.. వాటిని తన సాహిత్యంతో అందమైన పొదరిల్లుగా మార్చేశారు సిరివెన్నెల. మెగాస్టార్ చిరంజీవిపై సినిమాలో అందమైన పాట రాశారు సిరివెన్నెల. చార్మీకి జోడీగా శశాంక్ నటించాడు. జస్ట్ ఎల్లో మీడియా బ్యానర్ పై గంగరాజు గుణ్ణం, వెంకట్ డేగా ఈ సినిమాను నిర్మించారు. హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా ఈ సినిమా సండే పేరుతో రీమేక్ అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: