మన తెలుగు లో హీరోయిన్ లు సినిమాల్లో ఉన్నారు అంటే వారికి చాలా వరకు ఖర్చు చెయ్యాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి అన్ని విధాలుగా కూడా సహకరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ హోటల్  రూమ్ లో  ఆమెను ఉంచాలి. అదే విధంగా ఆమె అడిగిన కారు ని అరేంజ్ చెయ్యాలి ఇలా ఏ విధంగా చూసినా సరే నిర్మాతకు నానా రకాల బాధలు అనేవి ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇక నుంచి ఆ విధమైన పరిస్థితి ఉండదు. 

 

హీరోయిన్ సినిమా చేసినా లేకపోయినా సరే పాప డిమాండ్ ల విషయంలో మాత్రం ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. అది హీరో అయినా హీరోయిన్ అయినా ఎవరు అయినా సరే ఒకే విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గతంలో మాదిరిగా జేబులోకి చేయి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు ఎన్నో విధాలుగా ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినా చిన్న హీరోయిన్ అయినా సరే అదే విధంగా సినిమా చెయ్యాలి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తామని ముందుకి వెళ్తే నిర్మాత అంతిమంగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. 

 

ఇప్పుడు రాబోయే రెండు మూడేళ్ళ పాటు ఇదే విధంగా ఉంటుంది. పదేళ్ళ పాటు ఉన్నా సరే పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు అనే చెప్పాలి. ఎందుకు అంటే సినిమా ఈ కరోనా బారి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పడం చాలా కష్టం. నిర్మాతలు అయినా  హీరోలు అయినా సరే అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి. చూడాలి ఇక సినిమా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: