స్టార్ హీరోల సినిమా అనగానే సినిమా వసూళ్లు ఒక రేంజ్ లో ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే. ఇక సినిమాలో ఉండే ఖర్చు కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే సినిమా షూటింగ్ అవుతుది అంటే చాలు కచ్చితంగా సినిమాలో భారీగా ప్రతీ చిన్న విషయానికి కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుంది. నిర్మాతలకు హీరోలు దేవుళ్ళు అనే విషయం సినిమా పూర్తి అయ్యే వరకు ఉంటుంది అనే చెప్పాలి. స్వేచ్చగా షూట్ చేస్తూ ఉంటారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే పెట్టుబడి వస్తుంది లే అనే భావన కూడా ఉంటుంది. 

 

అయితే ఇప్పుడు ఆ స్వేచ్చ పెట్టుబడి పెట్టే విషయంలో నిర్మాతకు లేదు అని అంటున్నారు. గతంలో హోటల్ రూమ్స్ సహా అనేక విషయాల్లో భారీగా ఖర్చు చేసే పరిస్థితి అయితే ఉండేది. కాని ఇప్పుడు అలా ఖర్చు చేసే అవకాశం నూటికి నూరు శాతం లేదు. వంద రూపాయలు ఖర్చు చేసే విషయంలో ఇప్పుడు కనీసం 20 రూపాయలు అయినా తగ్గించే అవకాశం ఉంది. అంటే 20 శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది అనే చెప్పాలి. ఏ స్టార్ హీరో సినిమా అయినా ఏ స్టార్ హీరో చేసినా చేయకపోయినా సరే నిర్మాతలు మాత్రం అదే విధంగా ఆలోచన చేసి అడుగులు వేసే ఆలోచన లో ఉన్నారు అని చెప్పాలి. 

 

అగ్ర నిర్మాతలు అయినా చిన్న నిర్మాతలు అయినా సరే ఈ జాగ్రత్తలతోనే సినిమాను చేసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. వచ్చే ఏడాది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తే అప్పుడు ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: