టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు అనగానే అసలు పరిస్థితి ఏంటీ అనే చర్చలు చాలానే జరుగుతున్నాయి. సినిమా భవిష్యత్తు ఏంటీ అనేది స్పష్టంగా  చెప్పలేని పరిస్థితి అయితే మన తెలుగు లో ఉంది అనే చెప్పాలి. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు పడి సినిమాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు గతంలో మాదిరిగా స్వేచ్చగా ఉండే అవకాశం అయితే ఉండదు అనేది వాస్తవం. చిన్న హీరోల సినిమాల పరిస్థితి కూడా దాదాపుగా అంతే అనేది స్పష్టంగా చెప్పవచ్చు. 

 

సినిమాను విడుదల చెయ్యాలి అంటే గతంలో పెద్దగా ఆలోచన ఉండేది కాదు గాని ఇప్పుడు మాత్రం చాలానే సినిమా విషయంలో ఆలోచన చెయ్యాల్సిన సమయం అయితే వచ్చింది అనే చెప్పాలి. సినిమా మొదలు పెట్టాలి అంటేనే ఆలోచించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు అందరూ కూడా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి సినిమాలను ఓకే చేస్తున్నారు. చిన్నా పెద్ద నటులు అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటున్నారు. గతంలో మాదిరిగా స్వేచ్చగా ఖర్చు చేసే పరిస్థితి నిర్మాతకు లేదు. 

 

అందుకే స్టార్ హీరోలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. సినిమా అనగానే ఎంతో స్వేచ్చగా ఉండే మన జనాలు ఇప్పుడు సినిమా అనగానే ఒకటికి వంద సార్లు ఆలోచించి అప్పుడు ఓకే చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ అయిన తర్వాత పూర్తి గా సినిమాలు షూటింగ్ కి వెళ్ళినా సరే ఆ సినిమాలు అంత స్వేచ్చగా షూట్ చేసుకునే పరిస్థితి అయితే దాదాపుగా ఉండదు అనే చెప్పాలి. మరి తెలుగు సినిమా ఎప్పుడు లైన్ లో పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: