స్టార్ హీరో సినిమా అనగానే విదేశాల్లో షూటింగ్ ఉంటుంది. విదేశాల్లో షూటింగ్ లేనిదే సినిమా ఉండదు. గతంలో అయితే దాదాపుగా అదే పరిస్థితి మనం ఎక్కువగా చూసాం. మహేష్ బాబు అయినా మరో హీరో అయినా సరే విదేశాల్లో ఎక్కువగా షూటింగ్ ఉండే విధంగా ప్లాన్ చేసి సినిమాలు చేసే విధంగా పరిస్థితి అయితే ఉండేది అనే చెప్పాలి . అయితే ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ అనే మాట హీరోల నుంచి గాని దర్శక నిర్మాతల నుంచి గాని వచ్చే పరస్థితి అయితే లేదు అనే చెప్పాలి. దానికి కారణం సినిమాల్లో ఖర్చు తగ్గించే అవకాశం ఉండటమే. 

 

విదేశాల్లో ఏ దేశంలో చూసినా సరే కరోనా కేసులు భారీగానే వస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్లి సినిమాను ఏ హీరో అయినా సరే షూట్ చేసే వాతావరణం దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి ఉంటుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాలు అయినా సరే ఇండియా లోనే షూట్ చేయడమే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే అవకాశం అయితే లేదు. హిమ్చాల్ ప్రదేశ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లోనే సినిమాలను షూట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఇది ఎంత కాలం ఉంటుంది అనేది చూడాలి. 

 

స్టార్ హీరోల సినిమాలు ఎంత తక్కువలో పూర్తి అయితే అంత తక్కువలో పూర్తి చేసే ఆలోచనలోనే దాదాపుగా ఉన్నారు అని చెప్పాలి. అందుకే ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలను షూట్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఖరీదు అయిన దేశాల్లో షూటింగ్ అంటే వామ్మో అని హీరోలు దర్శక నిర్మాతలు కూడా అనే వాతావరణం ఇప్పుడు టాలీవుడ్ లో ఉంది అనేది అర్ధమవుతుంది. మరి ఏం జరుగుతుంది భవిష్యత్తు ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: