స్టార్ హీరో సినిమా అనగానే దానికి ఒక రేంజ్ ఉంటుంది అనే సంగతి తెలిసిందే. సినిమాలో ఉండే చాలా వరకు కోణాలు అన్నీ కూడా చాలా రిచ్ గా ఉండటం తో పాటుగా స్టార్ నటులు మంచి పాటలు పాటల్లో ఉండే డాన్స్ లు విదేశాల్లో షూటింగ్ సహా చాలా ఉంటాయి. మరి ఇక సినిమా మార్కెటింగ్ భారీగా లేకపోతే సినిమా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకే సినిమా మార్కెటింగ్ కోసం కూడా స్టార్ దర్శక నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. సినిమా మార్కెటింగ్ కోసం అని ఎక్కువగా కష్టపడుతూ... 

 

సినిమాలో కొన్ని కొన్ని కోణాలను చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మార్కెటింగ్ విషయంలో ఇప్పుడు వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. మార్కెటింగ్ విషయంలో గతంలో మాదిరిగా స్టార్ హీరోల కోసం కష్టపడే అవకాశం అయితే లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే సినిమా ఎంత ఫాస్ట్ గా పూర్తి అయితే దానిని అంత ఫాస్ట్ గా పూర్తి చేసి మార్కెటింగ్ మొత్తం కూడా సోషల్ మీడియాలో చేయడమే మంచిది అనే భావన లో ఉన్నారట జనాలు అందరూ కూడా. ఇదే విషయాన్ని స్టార్ హీరోలకు కూడా చెప్పేశారు అని తెలుస్తుంది. 

 

మార్కెటింగ్ కోసం ఎక్కువగా కష్టపడే అవకాశాలు ఉండవు అని ఎక్కువగా ఖర్చు చేయలేము అని చెప్తున్నారట. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు అందరూ కూడా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నారు మరి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. దీనికి అంతటికి ప్రధాన కారణం కరోనా భయం తో జనాలు హాల్ కి రాకపోవడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: