టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న వాతావరణం చూస్తే హీరోయిన్ లకు కాస్త కష్టంగానే ఉంది అని చెప్పాలి. హీరోయిన్ లు సినిమాలు చేయడం అనేది ఇప్పుడు చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకు అంటే వారి కోరికలు తీర్చే పరిస్థితి లేదు. వారు ఎక్కువగా డిమాండ్ చేసి అది కావాలి ఇది కావాలి అంటే ఇవ్వాలి అంటే నానా బాధలు పడాల్సి ఉంటుంది. ఇక అది పక్కన పెడితే హీరోయిన్ ల పారితోషికం కూడా ఎక్కువగా ఇచ్చే వాతావరణం అయితే లేదు అనే చెప్పాలి. పారితోషికం ఎక్కువగా ఇవ్వాలి అంటే సినిమాకు మార్కెట్ ఉండాలి. 

 

సినిమా మార్కెట్ ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఇచ్చే వాతావరణం అయితే ఉండదు అని చెప్పవచ్చు. అందుకే స్టార్ హీరోల విషయంలో హీరోయిన్ లను చాలా వరకు తక్కువకే సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేసి ఇవ్వలేదు అంటే నానా బాధలు పడాలి. సినిమా అసలే ఇబ్బంది పడే పరిస్థితి. ఒక రెండు మూడేళ్ళ పాటు సినిమాల విషయంలో ఖర్చు తగ్గించి చెయ్యాల్సి ఉంటుంది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక హీరోలు అయినా సరే మరొకరు అయినా సరే తగ్గాలి. 

 

అందుకే హీరోయిన్ ల విషయంలో భారీగా తగ్గి సినిమాలు చేస్తున్నారు అని నిర్మాతలు చాలా వరకు హీరోయిన్ లకు చెప్పేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జనాలు హాల్ కి వచ్చే అవకాశం లేదు. సీనియర్ హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ లను పక్కన పెట్టేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. వారు భారీగా డిమాండ్ చేస్తే అవసరం లేదు  అని చెప్పేస్తున్నారు అని టాక్ మరి. ఇది ఎన్ని రోజులో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: