తెలుగు, హిందీ సినీ పరిశ్రమలో కాంట్రవర్సీ, సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ కి 22 ఏళ్ళు.  బాలీవుడ్ లో తనదైన మార్క్ చాటుకున్న మూవీ ఇది.  1998 ఈ మూవీ తెరకెక్కించారు.  వర్మతో పాటుగా స్క్రీన్ ప్లే-డైలాగులు సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ రచించారు.  ఈ సినిమాలో జె. డి. చక్రవర్తి, మనోజ్ బాజ్ పేయి, ఊర్మిళ మండోద్కర్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన ఇండియన్ గ్యాంగ్ స్టర్ ట్రయాలజీలో మొదటి సినిమా.

 

అప్పట్లో రూ. 2 కోట్లు ఇబ్బందికరమైన తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను పూర్తిచేశారు.  1998లో సత్య బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన హిట్ గా నిలిచింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ మూవీతో సహా 6 పురస్కారాలు సాధించింది. 4 స్టార్ స్క్రీన్ అవార్డులు, బాలీవుడ్ మూవీ అవార్డు నుంచి ఉత్తమ దర్శకుడు పురస్కారం పొందింది. సత్య 1990ల నాటి సినిమాల్లో హిట్ సినిమాల్లో ఒకటిగానూ, మాడర్న్ మాస్టర్ పీస్ గానూ పరిగణిస్తారు.  

 

ఈ సందర్భంగా రచయిత కోన వెంకట్ ఈ మూవీతో తనకున్న అనుభవాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘22 సంవత్సరా క్రితం నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ‘చావు అంచుకు వెళ్లిన నా జీవితానికి ఈ మూవీ మరో కొత్త జన్మని ఇచ్చింది. అప్పుడు నాకు ఓ రచయతగా జననం.  రాంగోపాల్ వర్మ కు బాలీవుడ్ సైతం కొత్త అనుభవమే.. అదే సమయంలో నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. సత్య సనిమాతో ఓ పూనాది.. ఈ పునాదిపై ఇప్పటి దాక 54 అంతస్థుల రచనా సైథం నిర్మించే అదృష్టం. నా జీవితాన్ని మార్చిన ఆ సినిమాను, రాము ని ఎప్పటికి మర్చిపోలేను  అంటూ నాటి జ్ఞాపకాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: