సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఈమధ్యనే రిలీజైన సినిమా నగ్నం. సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా అందులో నటించిన హీరోయిన్ శ్రీ రాపాక సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించడంతో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తుంది. వర్మ ఆమెను ఎక్కడ నుండో తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు కాని ఆమె టాలీవుడ్ లో కాస్టూం డిజైనర్ గా చేస్తూ వస్తుంది. దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే సినిమాలకు కాస్టూం డిజైనర్ గా పనిచేసిన శ్రీ రాపాక పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా సరే చేయనని చెప్పిందట.

 

ముఖ్యంగా తను చేస్తే లీడ్ రోల్ లోనే చేయాలని డిసడి అయిన స్వీటీ ఫిదా సినిమాలో సాయి పల్లవి సిస్టర్ రోల్ చేసే చాన్స్ వచ్చినా సరే చేయనని చెప్పిందట. ఎందుకంటే సినిమాలో ఆ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడమే అందుకు కారణమని చెప్పింది. ఇక వర్మ సినిమాలో మాత్రం ఆ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన వెంకట్ ద్వారా ఈ ఆఫర్ వచ్చిందని.. ఆడిషన్స్ కు అరడజనుకి పైగా రాగా తనని చీరలో చూసే ఈ సినిమాలో కన్ ఫాం చేశాడని అన్నది స్వీటీ.

 

ఇండస్ట్రీ ఇక్కడ మనుషులు.. తను చేస్తున్న సినిమా ఇవన్ని తనకు తెలిసే చేశానని. తను కాస్టూం డిజైనర్ గా ఉన్నప్పుడు తన జోలికి ఎవరు వచ్చే వారు కాదని తేడా వస్తే తన్నేందుకు కూడా తాను వెనుకాడనని అంటుంది శ్రీ రాపాక. వర్మ నగ్నం సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు ఇక మీదట వరుస ఛాన్సులు అందుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాలని అనుకోవడం లేదని సెలెక్టెడ్ సినిమాలు చేయాలని చూస్తున్నానని అంటున్నారు స్వీటీ. నగ్నంతో మాస్ ఆడియెన్స్ కు దగ్గరైన ఈ అమ్మడు సోలో హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: