ఓటీటీ అన్నది ఒక మంచి ఫ్లాట్ ఫారం. నిజానికి ఈ రోజున ప్రపంచంలో ఎవరికీ అందనిది, దొరకనిది ఏంటి అంటే డబ్బు కాదు, సమయం.అందువల్ల ప్రతీ వారూ బిజీ లైఫ్ లో కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి వారి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దాన్ని వాడే వారి చేతిలోనే వినోదాన్ని పంచేందుకు ఒక ఒక ఫ్లాట్ ఫారం ఓటీటీ. అలాగే అక్కడ వెబ్ సిరీస్ తో జనాలకు సినిమా వినోదమే దక్కేలా చూస్తున్నారు.

IHG


నిజానికి సినిమా వాళ్లకు బుల్లి తెర అంటే చిన్న చూపు. ఇపుడు ఓటీటీ అన్నా కూడా అదే చూపు. దాంతో సినిమాలను  అలా ముగ్గబెట్టి మరీ దాచేస్తున్నారు తప్ప ఓటీటీ ద్వారా బయటకు తీసుకువచ్చే ఆలోచన చేయలేకపోతున్నారు. అయితే ఓటీటీని మాత్రం ఇతర వర్గాలు బాగా యూజ్ చేసుకుంటున్నయి.

IHG

బూతు కంటెంట్ తో   తీసేవారికి ఓటీటీ ఇపుడు వరప్రదాతగా కనిపిస్తోంది అంటున్నారు. సెన్షార్ షిప్ లేకపోవడంతో వెబ్ సిరీస్ ఫ్లాట్ ఫారం ని యూజ్ చేసుకుని మరీ అలా అసభ్యతతో  నింపేసి వదులుతున్నారు. మరి ఇది ఎంతవరకూ పోతుందో తెలియదు కానీ నగ్నంగా బొమ్మను పడేసి మరీ ఓటీటీ ద్వారా సొమ్ము కొల్లగొట్టాలనుకుంటున్నారుట.

IHG

ఇది నిజంగా మంచి పరిణామం కాదు కానీ యువతను పెడత్రోవ పట్టించేలా ఇపుడు వెబ్ సీరీస్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని మాత్రం గట్టిగా విమర్శలు ఉన్నాయుఇ. ఆలోచనాత్మకమైన కంటెంట్ తీసుకుని జనాలను ఆకట్టుకోవడానికి వెబ్ సిరీస్ ఒక మంది ఆలోచన, వేదిక. నిజానికి ఇలాంటి కంటెంట్ తో సినిమాలు తీస్తే ధియేటర్లు ఎవరూ ఆడించడానికి కూడా ఇవ్వరు. కానీ వెబ్ సిరీస్ మీద ఇపుడు పడి బూతు బొమ్మలను ఇక్కడకు తెచ్చి డంప్ చేస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ఇకనైనా మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్ వస్తాయో రావో. ఓటీటీని ఇలా ఒట్టిపోయేలా చేస్తారో ఏమిటో మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: