ప్రస్థుతం ముంబాయి నగరం కరోనా కేసులతో నిండిపోతూ ఉండటంతో ఈ మహానగరం అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని కరోనా కేసుల విషయంలో ఏర్పరుచుకున్న రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనితో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి రాజధానిగా పేర్కొనబడే ముంబాయిలో షూటింగ్ లు మరో మూడు నాలుగు నెలల వరకు ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.


ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ టాప్ సెలెబ్రెటీల నుండి చిన్న నటీనటుల వరకు అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం తమన్నా ముంబాయిలోని తన విలాసవంతమైన ఫ్లాట్ లో ఉంటూ ఈ కరోనా సమస్యల వల్ల వచ్చిన కెరియర్ బ్రేక్ ను తనకు పనికివచ్చే విధంగా ఉపయోగించుకుంటోంది.

 

ప్రస్తుతం తమన్నా ‘భగవద్గీత దుర్గాదేవి’ స్తోత్రాలు చదువుకుంటూ ఈ కరోనా సమస్యల నుండి తన కుటుంబ సభ్యులు సమాజం గట్టెక్కాలని ప్రతిరోజు ఆధ్యాత్మిక భావనలో ఎక్కువ సేపు కాలాన్ని గడుపుతోందట. ఈ విషయాలను స్వయంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా స్వయంగా తెలియచేసింది.


ఇదే ఇంటర్వ్యూలో తమన్నా రాజమౌళి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. రాజమౌళి ఒక నటుడుతో కాని లేదంటే ఒక నటితో కాని తనకు ఉన్న పరిచయాలను బట్టి జక్కన్న సినిమాలలో నటించే అవకాశాలు ఇవ్వరని ఒక నటుడి సమర్థత తాను తీసే సినిమాలోని పాత్రకు ఆ నటుడు లేదా ఆ నటి ఎంత వరకు సరిపోతారు అన్న విషయం పై రాజమౌళి నటీనటుల ఎంపిక ఆధారపడి ఉంటుందని తమన్నా కామెంట్స్ చేసింది. ‘బాహుబలి 2’ లో తమన్నా పాత్ర పూర్తిగా రాజమౌళి తగ్గించి వేయడంతో తమన్నా బాథ పడింది అంటూ అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలకు సమాధానంగా తమన్నా ఇప్పుడు ఇలా రాజమౌళి పై ఇలా కామెంట్స్ చేసి ఉంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ హవా బాగా పెరిగిన పరిస్థుతులలో తమన్నాకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీనితో ఆ నిరాశను ఇలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ తన బాధను తమన్నా ఈ కరోనా కాలంలో తగ్గించుకుంటోంది అని అనుకోవాలి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: