పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకుండా తన చాతుర్మాస దీక్షలు కొనసాగిస్తున్నాడు. దీనితో ఇప్పట్లో పవన్ తన అభిమానులకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండే పవన్ ఈ సంవత్సరం ఈ చాతుర్మాస దీక్ష కారణంగా తన పుట్టినరోజును జరుపుకునే అవకాశం లేదు.


అయితే రామ్ గోపాల వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేసుకొని స్థాయిలో పవన్ పుట్టినరోజు వేడుకలను జరిపించడానికి భారీ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ టైటిల్ తో పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీయబోతున్న వర్మసినిమా షూటింగ్ ను హైదరాబాద్ శివార్ ప్రాంతంలో వచ్చే వారం మొదలుపెట్టి షూటింగ్ ను చాల వేగంగా పూర్తిచేసి పవన్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి చాలముందుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టాక్. 


పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ ను పోలికలో ఉండే ఒక ఫామ్ హౌస్ ను ఇప్పటికే వర్మ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పవన్ వ్యక్తిగత జీవితాన్ని గుర్తుకు చేసే విధంగా ఈ మూవీలోని హీరో పాత్రకు ముగ్గురు భార్యలు అందులో ఒక రష్యన్ మహిళా పాత్రధారి ఉంటుందని లీకులు వస్తున్నాయి. 


అయితే ఈ మూవీలో పిల్లలతో పాటు 8 గేదెలు కూడ ఉంటాయని లీకులు వస్తున్న పరిస్థితులలో ఈ గేదెల సంఖ్య దేనికి సంకేతం అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మూవీలో చిత్రీకరించే ప్రతి సన్నివేశంలోను పరోక్షంగా పవన్ వ్యక్తిగత జీవితం సినిమాలు రాజకీయాల ప్రస్తావన ఉండే నేపధ్యంతో పాటు ఈమూవీ పవన్ పుట్టినరోజునాడు విడుదల అవుతూ ఉండటం సంచలనంగా మారింది. దీనితో పవన్ ప్రతిష్ఠకు డ్యామేజ్ కల్గించే ఈ మూవీని విడుదల కాకుండా అడ్డుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పవన్ అభిమానులతో పాటు పవన్ సన్నిహితులు కూడ సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: