రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో క్వాలిటీ ఉండట్లేదని, కంటెంట్ లేని సినిమాలని జనాల మీదకి వదిలి డబ్బులు పోగుచేసుకుంటున్నాడన్న విమర్శ ఉన్నమాట నిజమే. గత కొన్న్నేళ్ళుగా వివాదాలనే కథాంశాలుగా ఎంచుకుంటున్న వర్మ కంటెంట్ విషయంలో, క్వాలిటీ విషయంలో అస్సలు శ్రద్ధ చూపడం లేదు. అయితే కరోనా వైరస్ కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో వర్మ సరికొత్త దారిలో సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు.

 

థియేట్ర్లు మూతబడడంతో ఓటీటీ వేదికగా సినిమాలని రిలీజ్ చేద్దామని చూస్తుంటే, వర్మ మాత్రం తానే సరికొత్త ఫ్లాట్ ఫామ్ తో ముందుకు వచ్చాడు, ఆర్జీవీ వరల్డ్ పేరుతో  వెబ్ సైట్ లో పే పర్ వ్యూ పద్దతిలో సినిమా చూసే వెసులుబాటు కల్పించాడు. ఈ విధంగా ఇప్పటి వరకూ రెండు సినిమాలని రిలీజ్ చేసాడు. ఈ రెండు సినిమాలకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. పెట్టిన ఖర్చుకి ఎన్నో రెట్లు లాభాలు రావడంతో వర్మ వ్యాపారంపై అందరి దృష్టి పడింది.

 

ఓటీటీని మించి లాభాలు రావడంతో ఇదే బాగుందన్న ఉద్దేశ్యం చాలా మందిలో కలిగింది. అయితే తెలుగులో ఇంకా ఎవరూ వర్మ కొత్త పద్దతిని ఫాలో అవడానికి ముందుకు రాలేదు. కానీ తమిళ దర్శకనిర్మాత సీవీ కుమార్ ఆర్జీవీని ఫాలో అవుతున్నాడు. మొట్టమొదటి సారిగా తమిళంలో పే పర్ వ్యూ పద్దతిని ప్రవేశ పెట్టబోతున్నాడు. అయితే దీనికోసం రీగల్ టాకీస్ అనే యాప్ ని క్రియేట్ చేసాడు. ఈ యాప్ లో డబ్బులు చెల్లించి సినిమా చూడవచ్చు.

 

ఈ రీగల్ టాకీస్ యాప్ తమిళంలో సంచలనం రేపే అవకాశం ఉంది.  మరి ఓటీటీ ద్వారా ఒక్కసారి సబ్ స్క్రయిబ్ చేసుకుంటే సంవత్సరాంతం సినిమాలని చూసే వీలు కల్పిస్తున్న ఈ టైమ్ లో పే పర్ వ్యూ పద్దతి సక్సెస్ కావడం ఒకింత ఆశ్చర్యమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: