సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువ చెడు కూడా జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎవరిని పడితే వారిని ఏదీ పడితే అది అనేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఎదుటివారిపై బురదజల్లడమే ఇప్పుడు సమస్యగా మారింది. సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొంటున్న సమస్యల్లో ట్రోలింగ్ అనేది చాలా ఇబ్బందిగా మారింది. మొన్నటికి మొన్న హీరోయిన్ మీరా చోప్రా ఈ విషయంలో కేస్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

అంతే కాదు నిన్నటికి నిన్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్, తన మాటలని ట్విస్ట్ చేసి, వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకుని ట్రోల్ చేస్తున్నారంటూ కేసు పెట్టాడు. అయితే తాజాగా ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి సైబరాబాద్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆర్ ఎక్స్ 100 దర్శకుడి పేరుతో అమ్మాయిలని ఛీట్ చేస్తున్నారంటూ, అతని ఫేక్ ఐడీలతో అమ్మాయిలని తప్పు దారి పట్టిస్తున్నారని కేసు ఫైల్ చేసాడు.

 

 

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివే రెగ్యులర్ గా జరుగుతుంటాయి. పేరున్న దర్శకుడి పేరుమీదో, హీరో పేరు మీదో అకౌంట్స్ ఓపెన్ చేసి అవకాశాల కోసం తిరిగే వారిని టార్గెట్ చేస్తూ వారి నుండి డబ్బులు లాగడమో, లేక మరోరకంగా ఇబ్బంది పెట్టడమో చేస్తుంటారు. ఈ విషయమై అజయ్ భూపతి, తన పేరు చెప్పి ఎవరైనా అవకాశం ఉందని మెసేజ్ పెట్టినపుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోమని చెప్తున్నాడు.

 

 

ఆ మెసేజ్ అధికారికంగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలని, లేదంటే చిక్కులు ఎదురవుతాయని చెబుతున్నాడు. తన సినిమాలో ఆఫర్ అని మెసేజ్ రావడంతో ఒక అమ్మాయి ఫేస్ బుక్ లో మెసేజ్ చేయడంతో ఇదంతా జరుగుతుందని తెలిసిందని చెప్పాడు. ప్రస్తుతం అజయ్ భూపతి మహాసముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: