దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ రోజు తన 59వ పుట్టిన రోజున జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. అప్పట్లో కీరవాణి తండ్రి తన కుమారుడిని సినిమాల్లో పెట్టుకోవాల్సింది గా దర్శకుడు రాఘవేంద్ర రావు అని కోరాడు కానీ తాను మాత్రం మొదటి నుంచి చేసుకోకుండా సంగీతంలో ప్రావీణ్యం పొంది వస్తే తప్పకుండా అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అలాగే కీరవాణికి సంగీతం నేర్పవలసిన చక్రవర్తి కి ఒక సిఫార్సు లేఖ రాశాడు. రాఘవేంద్రరావు సిఫార్సుతో  కీరవాణి గురించి అప్పటికే ఎంతో బాగా తెలిసిన చక్రవర్తి అతడిని వెంటనే తన వద్ద అసిస్టెంట్ గా పెట్టుకుని నెలకి  రూ. 150 పారితోషకం ఇచ్చేవాడు. ఆ రూ. 150 డబ్బులను కీరవాణి ఇంట్లో ఇచ్చేవాడు. వాటి మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి జీవనాన్ని కొనసాగించేది.


చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా సుమారు 60 సినిమాల పైచిలుకు పనిచేసిన కీరవాణి... అక్కడినుండి బయటికి వచ్చి తానే సొంతంగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. చక్రవర్తి దగ్గర వయోలిన్ వాయిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేసిన కీరవాణి ని చూసి... రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... 'నాకు గనుక దర్శకత్వం చేసే అవకాశం వస్తే వెంటనే సంగీత దర్శకుడిగా పెట్టుకుంటాను' అని మాట ఇచ్చాడు. అయితే రామ్ గోపాల్ వర్మ కి శివ సినిమా ని దర్శకత్వం చేసే అవకాశం రావడంతో... మాట ఇచ్చినట్టుగానే కీరవాణి ని సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలి అనుకున్నాడు. కానీ నాగార్జున, వెంకట్,  సురేందర్ నువ్వు కొత్త వాడివి మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వాడు అయితే చాలా రిస్కు కదా అబ్బాయి గురించి తర్వాత చెబుతాను ఎప్పుడైతే ఇళయరాజా సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుందామని వాళ్ళు సూచించారు. అయితే దర్శకుడిగా అవకాశం చేజిక్కించుకునేందుకు ఎంతో కష్టపడిన రామ్ గోపాల్ వర్మ హీరో నిర్మాతలకు ఏ విషయంలోనూ అడ్డు చెప్పకూడదని దర్శకత్వం వహించే అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని భయపడి వాళ్లు చూసి ఇచ్చినట్టుగానే ఇళయరాజా ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు.


అలాగే కీరవాణి ని పిలిచి జరిగిందంతా చెప్పి తన రెండవ సినిమాలో అవకాశం ఇస్తానని రామ్ గోపాల్ వర్మ మళ్లీ మాటిచ్చాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కీరవాణి తీవ్ర మనస్థాపానికి గురి చెందాడు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక మళ్లీ సినిమాలలో అవకాశం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు.  కాలక్రమేణా తనకి ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మూడు సినిమాల్లో సంగీతం అందించే అవకాశం దొరికింది. ఆ మోడీ సినిమాలకి సంగీతం అందించిన అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 1989వ సంవత్సరంలో విడుదలై థియేటర్స్ లోకి వచ్చి పెద్ద సంచలనం సృష్టించింది. దాంతో రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమాతోనే గొప్ప డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే తన రెండవ సినిమా అయిన క్షణక్షణం లో మాట ఇచ్చినట్టుగానే కీరవాణి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: