టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాలో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగ‌తి విదిత‌మే. ఈ సినిమాను వాస్తవంగా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలలుగా షూటింగ్ లు క్యాన్సిల్ కావడంతో ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. దాదాపు రు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమ య్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ ప్ర‌తి నాయకుడిగా నటించనున్నాడ‌న్న‌ టాక్ వినిపిస్తోంది. 

 

ఎన్టీఆర్, మంచు మనోజ్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. మరో విశేషం ఏంటంటే వీరిద్దరిదీ పుట్టినరోజు కూడా ఒక రోజు కావడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: