రాయినైనా కరిగించే సంగీతంతో... సంగీత ప్రేక్షకులను పులకరింప జేసే మెలోడీ  సాంగ్స్ తో ... ప్రేక్షకులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తి  డివోషనల్ సాంగ్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఎమ్.ఎమ్.కీరవాణి. అయితే ఈ రోజు ఎం ఎం కీరవాణి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమ్.ఎమ్.కీరవాణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి ప్రస్థానం గురించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.



ఎమ్ఎమ్ కీరవాణి ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమాతో అంతగా గుర్తింపు సంపాదించుకొక  పోయినప్పటికీ ఆ తర్వాత సీతారామయ్యగారి మనవరాలు అనే సంగీత నేపథ్యం ఉన్న సినిమా  రావడంతో ఈ సినిమాలో సంగీతం అందించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఇక ఆ తర్వాత కీరవాణి ఇక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి, తెలుగు సంగీతాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.


 ఇక మాతృదేవోభవ సినిమా లో కీరవాణి అందించిన సంగీతం ఆయనను మరింత ఎలివేట్ చేసింది అంతేకాకుండా ఈ సినిమాలో రాలిపోయే పువ్వా అనే పాట ను స్వయంగా తానే పాడి మరింత గుర్తింపు సంపాదించారు. అయితే కీరవాణి కంటే ఓ విషయంలో ఆయన భార్యని ఎంతో షార్ప్ గా  ఉంటారట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కీరవాణి  చెప్పుకొచ్చారు. ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నప్పుడు వాళ్ల ముందు ఏమీ అనకొండ ఇంటికి వెళ్ళాక ఇలా అని ఉంటే బాగుండు అని కీరవాణి అనుకుంటారట... కానీ ఆయన భార్య మని మాత్రం ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే వెంటనే దానికి సరైన బదులు ఇచ్చేస్తారట. ఇలా సరిగ్గా స్పాంటేనియస్గా స్పందించడంలో ఆయన సతీమణి ఎప్పుడూ తన కంటే షార్ప్  ఉంటుందని కీరవాణి చెప్పుకొచ్చారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: