కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. మహమ్మారి వల్ల ఇప్పటి వరకూ ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. దినదినానికి దాని ప్రభావాని మరింత విస్తరిస్తూ ప్రపంచ ప్రజల్ని భయపెడుతుంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. పనులు లేక చేతిలో డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాక్సిన్ వస్తేనే గానీ ఇలాంటి పరిస్థితి నుండి బయటపడే మార్గాలు కనిపించట్లేదు.

 

 

ప్రపంచదేశాల ప్రజలందరూ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగులు మూడు నెలలపాటు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వాలు సూచించిన నియమాల ప్రకారం షూటింగులు మొదలయ్యాయి. సినిమాలతో పాటు సీరియల్స్ చిత్రీకరణ కూడా స్టార్ట్ అయింది. అయితే సీరియల్స్ స్టార్ట్ అయ్యాయో లేదో అక్కడ కూడా కరోనా మహమ్మారి భయపెడుతోంది.

 

 

ఇప్పటికే ప్రభాకర్ , హరిక్రిష్ణ, నవ్యస్వామి మొదలగు సీరియల్ నటులకి కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరందరూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా మరో సీరియల్ యాక్టర్ కి కరోనా సోకింది. సీరియల్ యాక్ట్అర్ రవిక్రిష్ణకి కరోనా పాజిటివ్ అని తేలింది. రవిక్రిష్ణ ఆమెకథ సీరియల్ లో ప్రధాన పాత్రని పోషిస్తున్నాడు. అయితే రవిక్రిష్ణ బాగా పాపులర్ అయింది మాత్రం బిగ్ బాస్ వల్లనే.

 

IHG

బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చిన రవిక్రిష్ణ చాలా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కరోనా బారిన పడడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు. తనతో పాటు గత కొన్ని రోజుల నుండి క్లోజ్ ఉన్నవారు కూడా క్వారంటైన్ లోకి వెళ్ళారట. అయితే తనకి లక్షణాలేమీ లేవనీ, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: