కీరవాణికి నాలుగేళ్ళ వయసున్నప్పుడు తన తండ్రి అతడిని కర్ణాటక సంగీతం నేర్పించే కవిఠపు సీతన్న వద్ద జాయిన్ చేశాడు. అయితే కీరవాణికి కేవలం నాలుగు సంవత్సరాలే ఉన్నప్పటికీ గురువు చెప్పే సంగీత మెలకువలను ఒక పట్టాన ఒడిసిపట్టే వాడట. పదవ తరగతి పూర్తయిన అనంతరం తండ్రి కీరవాణికి గిటార్ నేర్పించారు. అలాగే తన స్నేహితుడైన చక్రవర్తికి తన కుమారుడు కీరవాణి ని పరిచయం చేసాడు శివ శక్తి దత్త. దీంతో చక్రవర్తి కీరవాణి ని దగ్గరికి పిలిచి ఏమి నేర్చుకున్నావో చేసి చూపించమని అడిగాడు. ఆయన అడిగిన వెంటనే కీరవాణి వయోలిన్, హార్మోనియం ప్లే చేసి చూపించాడు. అతని సంగీతం నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన చక్రవర్తి శివ శక్తి దత్త తో మాట్లాడుతూ మీ కుమారుడిని చదువు మధ్యలోనే ఆపు చేయించి తనతో పంపించమని అడిగాడు. కానీ తన కుమారుడిని పైచదువులు చదివించాలని శివ శక్తి దత్త చక్రవర్తి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు.


కీరవాణి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం వారి ఆర్థిక పరిస్థితి మరీ దిగజారాయి. దీంతో ఇంట్లో ఉన్న ఒకే ఒక యుక్తవయసు కలిగిన కీరవాణి డబ్బులు సంపాదించే అవసరం ఏర్పడింది. డబ్బు సంపాదించాలని తన ఫ్రెండు మణిశర్మ తో కలిసి చిన్న బృందంగా ఏర్పడి సంగీత కచ్చేరీలను ఇచ్చేవాడు. కానీ వీళ్ళని స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే వారు. మణిశర్మ తండ్రి తనకి తెలిసిన వారితో కలిసి కీరవాణి సంగీత కచేరీలను నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపేవారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కలిసి రాఘవేంద్రరావు వద్దకు వెళ్లి కీరవాణి ని అతడి సినిమాలో సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలి అని కోరారు. కానీ రాఘవేంద్రరావు మాత్రం అందుకు నిరాకరించి కీరవాణిని ఎవరైనా సంగీత అనుభవజ్ఞుల దగ్గర అసిస్టెంట్ గా పని చేసి సంగీతంలో ప్రావీణ్యం పొంది వస్తే తను తప్పకుండా అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అలాగే కీరవాణిని చేర్చుకోవాల్సిందిగా ఒక రికమండేషన్ లెటర్ కూడా చక్రవర్తికి పంపించాడు.


అలాగే గీత రచన కూడా నేర్చుకోవాలని ఉద్దేశంతో వేటూరి సుందర రామ్మూర్తి వద్ద అసిస్టెంట్ గా చేరాడు. అయితే ఒక సంవత్సరం పాటు వేటూరి సుందర్రామ్మూర్తి వద్ద పనిచేసిన కీరవాణి తన మంచి ప్రవర్తనతో అతని మన్నలను పొందాడు. కీరవాణి మంచి మనసును తెలుసుకున్న వేటూరి సుందర రామ్మూర్తి అతడిని వేటూరి రామోజీరావు కి పరిచయం చేసి గొప్పగా చెప్పాడు. అదేసమయంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద మనసు మమత సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో రామోజీ రావు కీరవాణి మనసు మమత సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. శివ సినిమా లో చేసే అవకాశం కోల్పోయినప్పటికీ ఉషాకిరణ్ మూవీస్ వంటి ప్రముఖ బ్యానర్ లోని సినిమాకి సంగీత బాణీలను అందించే అవకాశం రావడంతో అతను బాగా సంతోషించాడు. తన మొదటి సినిమా కావడంతో తన సంగీత నైపుణ్యాన్ని మొత్తం ఉపయోగించి మనసు మమత అనే సినిమాకి అద్భుతంగా సంగీత బాణీలను అందించాడు.


ఎక్కడ సంగీతాన్ని ఎక్కువగా సమకూర్చారో ఎక్కడ తక్కువగా సమకూర్చారో జాగ్రత్త పడి పరిమితులు దాటకుండా సంగీతాన్ని ఎక్కువగా అందించకుండా ఒక లయబద్ధంగా ఉండే అద్భుతమైన సంగీతాన్ని మనసుమమత సినిమాకి సమకూర్చి అందరి ప్రశంసలను పొందాడు కీరవాణి. మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ లో నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలో సంగీత బాణీలను అందించి గుర్తింపు తెచ్చుకున్నాడు. తదనంతరం మళ్ళీ ఉషా కిరణ్ మూవీస్ లో అశ్విని సినిమాకి సంగీత బాణీలను అందించి సూపర్ గా పాపులర్ అయ్యాడు. ఈ మూడు సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడానికి వేటూరి సుందర రామ్మూర్తి మాత్రమే కారణమని అతని తండ్రిగా భావిస్తాడు కీరవాణి. అలాగే వేటూరి రామోజీరావు తన పెరుగుదలకి తొలిమెట్టు వేశారని కీరవాణి చెబుతుంటాడు.




Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: