1961 జులై 4వ తేదీన శివ శక్తి దత్త, భాగమతి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని కోడూరు గ్రామంలో మరకతమణి కీరవాణి జన్మించాడు. ఇతని తండ్రి meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి దేవి భక్తుడు కావడంతో మరకతమణి కీరవాణి రాగం పై ఇష్టంతో కీరవాణి అని... ఆవిధంగా మరకతమణి కీరవాణి అని పేరు పేరు పెట్టారు. కీరవాణి జన్మించిన ఈ సమయంలో వారి తాతయ్యకు ఎన్ని ఆస్తులు ఉండేవి. వాళ్ల తాతయ్య
రాయచూర్ లో కూడా ఎన్నో పొలాలు కొన్నాడు. వెళ్లి ఇంట్లో ఎప్పుడూ వ్యవసాయ వాతావరణం నెలకొనేది. కానీ కీరవాణి తండ్రికి గురించి వ్యవసాయం పై మక్కువ లేక లలిత కళలపై ఇష్టంతో ముంబాయి నగరానికి మకాం మార్చారు. తదనంతరం జేజే స్కూల్లో జాయిన్ అయ్యి సంగీత నేర్చుకునేవాడు. కానీ తన తాతయ్య కి శివశక్తి దత్తా సంగీతం నేర్చుకోవడం నచ్చక పోయేది.


కీరవాణి తండ్రి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి రెండు- మూడు సినిమాలకు సంగీత బాణీలను కూడా సమకూర్చారు. కానీ ఆ రెండు సినిమాలు తప్ప మిగతా ఏ సినిమాకి సంగీతం సమకూర్చే అవకాశాలు రాకపోయేసరికి ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. తదనంతరం పలు వ్యాపారాలు ప్రారంభించి ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో కీరవాణి డిగ్రీ విద్యను అభ్యసించే రోజుల్లో వారు కటిక పేదరికం లో బతికేవారు.


కీరవాణి 3 ఏళ్లు ఉన్నప్పుడు కిచెన్ లోని గ్లాస్ లలో నీరుపోసి జలతరంగిణి రాగాన్ని సృష్టించే వారట. అలాగే తపాలా, బిందెలు, బకెట్లు ప్లేట్లు గ్లాసులు ఇలా దేనిపై పడితే దాని పై లయబద్దంగా కొట్టి సంగీతాన్ని సృష్టించే వాడట. కీరవాణి సంగీతం సృష్టిస్తుంటే అతని తల్లి భానుమతి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని మండిపడేవారట. కానీ తన తండ్రి శివ శక్తి దత్త మాత్రం కీరవాణి పెద్ద సంగీత విద్వాంసులు అవుతాడని గ్రహించి అతన్ని బాగా ప్రోత్సహించేవారట.


కీరవాణి ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం కోడూరు లోనే పూర్తయింది. హైస్కూల్ విద్యాభ్యాసం మాత్రం కాకినాడలోని నెహ్రూ కాన్వెంట్ లో చదివాడు. కీరవాణి పదవ తరగతి పూర్తి చేసిన అనంతరం కుటుంబం మొత్తం రాయచూర్ మకాం మార్చి అక్కడ ఉన్న తమ సొంత పొలాలలో లంబాడి ప్రజలతో కలిసి వ్యవసాయం చేసేవారు. అప్పుడే కీరవాణి లంబాడీ భాష కూడా నేర్చుకున్నాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: