ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేరుప్రఖ్యాతలు సంపాదించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్  కీరవాణి స్వరపరిచిన పాటలు ఎంత మధురంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్, చత్రపతి, సింహాద్రి, క్షణక్షణం,  బాహుబలి, సై, యమదొంగ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి తెలుగు సినీ పరిశ్రమలో దగ్గర సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అతను అన్నమయ్య సినిమాకి స్వరపరిచిన సంగీతం తెలుగు ప్రేక్షకుల మనసులను పులకరింప జేసింది. ఈ సినిమాలో అతని సంగీతానికి గాను జాతీయ పురస్కారం కూడా లభించింది. బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన ఎమ్.ఎమ్.కీరవాణి ఈ రోజు తన 59వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను ఇటీవల కాలంలో ప్రజల సంక్షేమం కొరకు ఏం చేశాడో చెప్పుకుందాం. 


అమెరికా, కెనడా, స్పెయిన్ దేశాలలో లాగానే భారతదేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతో అప్రమత్తంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను, ఆంక్షలను కఠినంగా పాటిస్తే తప్ప కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం దాదాపు అసాధ్యం. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తేవాలంటే ప్రజల వల్లనే సాధ్యమవుతుంది. దీంతో ప్రముఖ రాజకీయ నేతలు సినిమా వాళ్ళు తమ వంతుగా ప్రజల్లో అవగాహన తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో పాపులారిటీ ఉన్న సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కరోనా పై ఒక పాట పాడి ప్రజల్లో అవగాహన కల్పించాడు. 


జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ లోని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం పాటని ఎం ఎం కీరవాణి స్వరపరిచాడు అన్న సంగతి తెలిసిందే. అయితే అదే పాట యొక్క సాహిత్యాన్ని మార్చి కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు ఎమ్.ఎమ్.కీరవాణి. 

ఓహ్ మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్
డియర్ మేడమ్స్, గురుబ్రహ్మలారా

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము
చిలిపి తలపు చివరి మలుపులో
వీ మిస్ అల్ ద ఫన్
వీ మిస్ అల్ ద జాయ్
వీ మిస్ యు
వీ మిస్ అల్ ద ఫన్
వీ మిస్ అల్ ద జాయ్
వీ మిస్ యు... వరిజినల్ పాటల్లో సాహిత్యం ఇలా ఉంటే... ప్రస్తుతం కరోనా పై కీరవాణి రూపొందించిన పాట... 

ఓహ్ మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్
డియర్ మేడమ్స్, భారతీయులారా 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగంమొక్కటి 
ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో
తరుముదాము దాన్ని బయటకి
వీ విల్ స్టే అట్ హోమ్
వీ విల్ స్టే అట్ హోమ్
వీ స్టే సేఫ్... ఇలా ప్రజల్లో అవగాహన కల్పించే లా ఉంది. ఏదేమైనా మధురమైన పాట తో కరోనా పై అవగాహన కల్పించినందుకు కీరవాణికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: