సినిమాలకు కావాల్సింది సంగీతం.. చక్కటి సంగీత కనుక సినిమాకు ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే.. ఇకపోతే 
మన తెలుగులో ప్రముఖ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఆయన సంగీతం అనగానే చాలా మందికి ఒక క్రేజ్ ఉంటుంది. అది మన తెలుగు లో మాత్రమే కాదు ఇతర భాషల్లో అని కూడా అంటున్నారు ఆయన సంగీతాన్ని ప్రేమించిన వారు. అవును ఆయన సంగీతం కోసం ఇతర భాషల్లో కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. 

 

 

పర భాషలో ఉండే  స్టార్ హీరోలు కూడా ఆయన సంగీతం కోసం తెలుగులో సినిమాలు చెయ్యాలి అని అనుకున్నారు. అలాగే అక్కడ కూడా... ఆయన తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అని అంటారు. హిందీ, తమిళం లో స్టార్ హీరోలు కూడా ఆయన తో సినిమాలు చేయడానికి ఆయన కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఆయన  విషయంలో ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు కూడా సానుకూలంగా ఉండి యువ దర్శకుల కంటే ఆయన మంచి సంగీతం అందిస్తారు అని కూడా భావిస్తూ ఉంటారు.

 

 

 అందుకే  తమ సినిమాలకు ప్రభాస్  లేదా పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితి ఉంది అని అంటున్నారు.  అప్పట్లో ఆయన సంగీతం కోసం మోహన్ బాబు అయితే  ఫోన్ చేసే వారు అని, అయినా సరే ఖాళీ లేదు అని ఆయన  డేట్స్ ని వాయిదా కూడా వేసారు అని అంటున్నారు.కీరవాణి సంగీత గొప్పతనం అందరికి పూర్తిగా తెలియాలంటే బాహుబలి లాంటి సీనియాలో చూడాల్సిందే..ఓ రకంగా ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం కీరవాణి గారే.. అందులో ఎవరికీ సందేహం లేదు. అలాంటి సంగీత సరస్వతి కీరవాణి గారు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మీరు ఇలాగే ఎన్నో ప్రభంజనాలను సృష్టించాలని కోరుకుంటూ మా హెరాల్డ్ ఛానెల్ తరపు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు కీరవాణి గారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: