నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదన్న కారణంగా ఆయన అభిమానులు యూవీ క్రియేషన్స్ పై తమ అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ రానప్పటికీ, తాజాగా ప్రభాస్ తర్వాతి చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

 

జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి ఒక కారణం ప్రభాస్ అయితే, రెండవ కారణం నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు మాస్ హీరో ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయనున్నాడనేది ఆసక్తికరం.

 

 

అయితే ప్రభాస్ తో సినిమా తీయాలని చాలా మంది బాలీవుడ్ దర్శకులు చూస్తున్నారు. సాహో సినిమాతో నార్త్ లో తనకి ఎంత మార్కెట్ ఉందో చూపించుకున్న ప్రభాస్ తో సినిమా తీసేందుకు బాలీవుడ్ దర్శకులు రెడీ అవుతున్నారు. ముందుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఓం రౌత్, అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన తానాజీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

IHG's Tanhaji threatened by <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CONGRESS-NCP' target='_blank' title='ncp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ncp</a> MLA: 'Make some quick changes else I  will take personal interest in this' - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BOLLYWOOD' target='_blank' title='bollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bollywood</a> - Hindustan Times

 

తానాజీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తో సినిమా అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కేందుకు అవకాశమ్ ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నిర్మించనుందట. మరి ఈ విషయమై అధికారిక సమాచారం వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: