కరోనా మహమ్మారి కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంద రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. అతనొక్కడే కాదు సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమై సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో దోశలు చేసుకుంటూ, బట్టలు ఉతుకుతూ, ఇల్లు కడుగుతూ కనిపించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంటి పనులు చేస్తున్నట్టు ఎవరికీ కనిపించలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ప్రజలకు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి తగు జాగ్రత్తలు కూడా చెప్పుకొచ్చాడు. డిజిటల్ ప్రపంచంలో అడపాదడపా పవన్ కళ్యాణ్ కనిపించాడు కానీ బాహ్య ప్రపంచంలో ఎన్నడూ కనిపించలేదు. ఐతే ఇంతకీ ఈ వంద రోజులు ఖాళీ సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడని తన అభిమానులు అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర వ్యాఖ్య సన్నిహిత వర్గాల నుండి వెలువడింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ తన సమయాన్ని ఎక్కువగా కుటుంబంతో గడిపారట. అలాగే తనకిష్టమైన పుస్తకపఠనం పై దృష్టి సాధించి ఎక్కువ పుస్తకాలను చదివాడట. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో అనేక సినిమాలు కూడా చూసి తన సమయాన్ని సరదాగా గడిపాడు. తన తదుపరి సినిమా స్క్రిప్ట్ లను చదివి మళ్ళీ కొన్ని మార్పులు చేయవలసిందిగా దర్శకులకు సూచించాడట.


అలాగే తాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించాలని, స్క్రిప్టులో అక్కడక్కడ మార్పులు చేయాలని సూచించారట. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న విరూపాక్ష,  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక సినిమా స్క్రిప్ట్ లను కూడా అధ్యయనం చేసి మార్పులు చేయవలసిందిగా కోరారట. వీడియో కాల్ ద్వారా దర్శకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలపై ప్రత్యక్షంగా ఎక్కువ శ్రద్ధ చూపారు. ఏదేమైనా ఈ వంద రోజుల సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: