మాటకు ఊహకందని విధంగా స్వరాలను సమకూరుస్తూ అద్భుతమైన పాటలను అందిస్తూ అన్ని రకాల పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుడు ఎం ఎం కీరవాణి. తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి తనకు తిరుగులేదని నిరూపించుకుని  విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఈ  స్వరకర్త. ఈ స్వరకర్త స్వరం నుంచి జాలువారిన అద్భుతమైన కలికితురాయి లాంటి పాఠాలు ఎన్నో. సంగీత దర్శకుడిగా కీరవాణి ప్రస్థానం మహాద్భుతం అనే చెప్పాలి. మూడు తరాలకు సంగీత వారధిగా... అసలు సిసలైన తెలుగు సాహిత్యానికి మారుపేరుగా ఇప్పటికీ కూడా కీరవాణి స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. 

 

 నేటితరం జనరేషన్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా మెలోడీ సాంగ్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తు ఇప్పటికి కూడా... తెలుగు ప్రేక్షకులందరినీ ఓలలాడించే  మెలోడీ తో మైమరిపింప చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, కీరవాణి అందించే పాటకి ప్రతి ఒక్క సంగీత ప్రేక్షకుడు  ఫిదా అవ్వాల్సిందే. ఆ పాట లోని పరమార్ధానికి  నీరాజనాలు పలకేల  తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేశారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎంతగానో కీర్తిని సంపాదించి జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ఎమ్.ఎమ్.కీరవాణి. 

 

 అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన  క్షణం క్షణం సినిమాకి  ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే, క్షణక్షణం సినిమాలో స్వరాలతో విన్యాసాలు చేశారు ఎమ్.ఎమ్.కీరవాణి. ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ సమయంలో వర్మ కీరవాణి పై ప్రశంసలు కురిపించారు . క్షణక్షణం సినిమాలో  ఎమ్ఎమ్ కీరవాణి అందించిన సంగీతం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది అంటూ వర్మ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో సరికొత్త కీరవాణి ని  తెలుగు ప్రేక్షకులు చూస్తారు అంటూ తెలిపాడు. అన్నట్లుగానే ఆ సినిమా పాటలు బ్యాక్ గ్రౌండ్ టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: