భక్తి పాటలు రక్తి పాటలు అయినా తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు ఎమ్.ఎమ్.కీరవాణి. వినసొంపైన సంగీతం తో అద్భుతమైన పరమార్థం తో ఆయన  స్వరం నుంచి జాలువారిన పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అన్నమయ్య సినిమాలో భక్తి పాటలను అందించి ప్రేక్షకులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తాలన్న... సై లాంటి సినిమాల్లో రక్తి పాటల తో ప్రేక్షకులందరి నీ ఉర్రూతలూగించాలన్న... బాహుబలి లాంటి సినిమాలో ఒక రాజు రాజసాన్ని తన పాట లో  అద్భుతంగా వ్యక్తపరచాలి అన్న అది ఒక్క ఎమ్.ఎమ్.కీరవాణి కే సొంతం అనడం లో అతిశయోక్తి లేదు. 

 

 తెలుగు చిత్ర పరిశ్రమ లో మూడు తరాలకు సంగీత వారధిగా ఉన్నారు ఎం ఎం కీరవాణి. ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గానే కొనసాగుతూ తన ప్రస్థానం ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి అందించిన పాట ల్లో కలికితురాయి లాంటి పాటలు ఎన్నో, కేవలం ఒక్క భాషలోనే కాకుండా తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో కూడా తన సంగీతంతో ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేసి  ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు ఎంఎం  కీరవాణి.  

 

 అయితే ఎం.ఎం.కీరవాణి ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత అనే సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఇక అక్కడి నుంచి ప్రారంభమైన కీరవాణి ప్రస్థానం ప్రేక్షకు ల్లో ఎనలేని ఖ్యాతిని   సంపాదించింది. ఏతరం లోనైనా ఆయన పాటల కు జనం నీరాజనాలు దక్కేవి. అయితే ఎమ్.ఎమ్.కీరవాణి ఆయన కెరియర్ మొదట్లో కేవలం 200 రూపాయల పారితోషికం తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసేవారట.ఆ 200 రూపాయల తోనే కుటుంబాన్ని మొత్తం పోషించేవారట ఎంఎం కీరవాణి.

మరింత సమాచారం తెలుసుకోండి: