తెలుగులో మళయాల చిత్రాల రీమేక్స్ బాగా పెరిగాయి. మన సినిమాలు హిందీలో రీమేక్ కి వెళ్తుంటే మనవాళ్లేమో మళయాల సినిమాలని ఇక్కడకి తెస్తున్నారు. మెగాస్టార్ లూసిఫర్ చిత్రంతో పాటు ఇప్పటి వరకూ చాలా చిత్రాలు తెలుగులో రీమేక్ కానున్నాయి. మొన్నటికి మొన్న అయ్యప్పనుమ్ కోషియం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ హక్కులని కొనుక్కున్న సంగతి తెలిసిందే.

IHG

 

నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాతో ఇటీవలే మంచి హిట్ సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరో మళయాల చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనుంది. కప్పెలా అనే మళయాల సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ మేరకు కప్పెలా చిత్ర నిర్మాత విష్ణు వేణూ అధికారికంగా వెల్లడించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న మూడవ రీమేక్ చిత్రం ఇది. 

IHG'Kappela' (2020) available to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WATCH' target='_blank' title='watch-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>watch</a> on UK Netflix - NewOnNetflixUK

 

ఇప్పటి వరకూ ప్రేమమ్, అయ్యప్పనుమ్ కోషియం చిత్రాల రీమేక్స్ రైట్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమాలో అన్నా బెన్, శ్రీనాథ్ బాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలుగా పోషించారు. ఈ సంవత్సరం మార్చ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్వ్యూస్ దక్కించుకుంది. నిజానికి సూపర్ హిట్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా థియేటర్లు మూతబడడంతో రెవెన్యూ పరంగా అంతగా దక్కించుకోలేక పోయింది.

IHG

 

అయితే కప్పెలా తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేసేది ఎవరో ఇంకా ప్రకటించలేదు. నటీనటులు ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: