తొలి సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడు అజయ్ భూపతికి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ, హీరోయిన్ గా నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు కూడా ఇదే తొలి సినిమా. దీంతో వీరు ముగ్గురూ కూడా ఫేమస్ అయ్యారు. వీరికొచ్చిన ఫేమ్ ను కొందరు తమ స్వార్ధానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా దర్శకుడు అజయ్ భూపతి పేరును ఉపయోగించి ఓ వ్యక్తి చేసిన పనికి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు అజయ్.

IHG

 

కొత్త నటులకు అద్భుత అవకాశమంటూ ఓ వ్యక్తి అజయ్ భూపతి పేరు ఉపయోగించాడు. ఈ నెపంతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు విచారణ చేపట్టారు. వీరి విచారణలో అజయ్ భూపతి పేరుతో సదరు వ్యక్తి మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే అజయ్ భూపతి అలెర్ట్ అయి ఓ ట్వీట్ చేశాడు. తాను ఎటువంటి టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించలేదని క్లారిటీ ఇచ్చాడు. తన పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దని స్పష్టం చేశాడు. తన సినిమాల గురించి ఎటువంటి ప్రకటన అయిన అఫిషియల్ గా తెలియజేస్తానని చెప్పాడు. సదరు నిర్మాణ సంస్థ నుంచి మాత్రమే తన ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు.

IHG

 

ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించాడు. ప్రస్తుతం అజయ్ భూపతి మహా సముద్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్ద్ హీరోలుగా నటిస్తున్నారు. గతంలో దర్శకుడు తేజ కూడా  ఫిలిం ఇనిస్టిట్యూట్ పెట్టాడని కొంతమంది జాయిన్ అయ్యారు. తర్వాత తేజనే స్వయంగా నేనెటువంటి ఇనిస్టిట్యూట్ పెట్టలేదని క్లారిటి ఇచ్చాడు. వీరు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే దర్శకులు కావటంతో వీరి పేరుతో ఇటువంటి మోసాలు జరగుతూండడం విచారకరం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: