తెలుగు సినిమా సంగీతంలో సుపరిచితుడైన సంగీత దర్శకుడు రఘు కుంచె. రీసెంట్ గా 47 డేస్ అనే సినిమాకు సంగీతం అందించాడు రఘు. పలాస 1978 సినిమాకు సంగీత అందించడంతో పాటు ఆ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి నటనతో మెప్పించాడు. ప్రస్తుతం రఘు కుంచె గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. త్వరలోనే నటుడిగా మరో సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించి అఫిషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా చేస్తున్నట్టు రఘు కుంచె కూడా అఫిషియల్ గా కన్ఫర్మ్ చేశారు.

IHG

 

1991లో జరిగిన యదార్ధ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో రఘు కుంచె మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. 29ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఓ మహిళ జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ‘కథా నళిని‘ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పాత్రకు భర్తగా మురుగున్ పాత్రలో రఘు కనిపించనున్నాడు. కొక్కిరిగడ్డ మహేంద్ర స్వీయ రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా సినిమాగా తెరకెక్కించనున్నారు. టైటిల్ పాత్రలో ప్రముఖ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

IHG

 

గోగో మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో పిరియాడికల్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి డిటెయిల్స్ త్వరలో రివీల్ చేయనున్నారు. రఘు కుంచె స్వయంగా ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, సంగీత దర్శకుడు.. ఇలా తనలోని మల్టీటాలెంట్ తో సినీ రంగంలో రాణించాడు రఘు. పలు సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన రఘు తన టాలెంట్ తో ఆకట్టుకున్నాడు.. ప్రైవేట్ సాంగ్స్ చేయడంతో రఘు దిట్ట.

మరింత సమాచారం తెలుసుకోండి: