దేశంలో విధించిన కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఎక్కువ నష్టపోయిన రంగం సినిమా రంగం. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చాలా సంస్థలు మళ్లీ యధావిధి స్థితికి వస్తున్నా గాని సినిమా రంగం మాత్రం అన్ లాక్ లోనే ఉండిపోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకుని వ్యాపారం చేస్తున్న వాళ్ళు మరియు ఇంకా అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. వైరస్ తీవ్రత బట్టి చూస్తే ఇప్పుడప్పుడే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదని చాలామంది అంటున్నారు. పైగా మూడు నెలలుగా థియేటర్లు మొత్తం క్లోజ్ అవ్వటంతో పాటుగా సినిమా ఇండస్ట్రీ షూటింగ్ మొత్తం ఆగిపోవటంతో నటీనటులు కూడా చాలా అవస్థలు పడ్డారు.

 

కానీ ఇటీవల కేంద్రం షూటింగులు జరుపుకోవచ్చని నిబంధనలు విధిస్తూ అనుమతులు ఇవ్వటంతో నటీనటులు మళ్లీ మేకప్ వేసుకుంటూ షూటింగ్లో పాల్గొంటున్నారు. కానీ సినిమా థియేటర్ ల పరిస్థితి ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయి. ఇటువంటి తరుణంలో కేంద్రానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా బహిరంగ లేఖ రాసింది. ఇటీవల ప్రకటించిన అన్ లాక్2.0లో సినిమా థియేటర్లు రీ ఓపెన్ చేయలేదని సోషల్ డిస్టెన్స్ మరియు క్రౌడ్ కంట్రోల్ చేస్తామని చెప్పినా గానీ అనుమతులు ఇవ్వలేదు ఇలా అయితే కష్టమని కేంద్రానికి తమ బాధను విన్నవించుకున్నారు. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల వ్యాపారం పై ఆధారపడిన వారు రెండు లక్షల మంది ఉన్నారని వారంతా ఉపాధి కోల్పోతున్నారని రాసిన లెటర్ లో కేంద్రానికి తెలిపారు.

 

ఇదిలావుండగా మొదటి లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నా ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్, ఆస్ట్రియా, హాంకాంగ్, బెల్జియం, మలేషియా వంటి దేశాల్లో ప్రజెంట్ సినిమా థియేటర్ లు ఓపెన్ అవ్వటం జరిగిందని…. ఆ దేశంలో పాటించిన నిబంధనలను పాటిస్తూ  మన దేశంలో కూడా సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యం కోరాటం జరిగింది. థియేటర్ల యాజమాన్యం రాసిన లెటర్ పై కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు… రాబోయే 14 రోజుల్లో కేసుల తీవ్రత బట్టి థియేటర్ లు ఓపెన్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: