టాలీవుడ్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ అల్లువారి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టైటిల్ ఫస్ట్ లుక్ తో పాటు చరణ్ పాత్ర తాలూకు ఇంట్రో వీడియో కొద్దిరోజుల క్రితం ఆయన జన్మదినం సందర్భంగా యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుండి మంచి స్పందనను రాబట్టింది. కొన్నాళ్లుగా కరోనా కారణంగా మన దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఆర్ఆర్ఆర్ షూట్ కి కూడా బ్రేక్ పడింది. 

IHG

కొద్దిరోజుల క్రితం సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతినివ్వడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా తమ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలెట్టినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఎవ్వరూ కూడా ఖచ్చింతంగా చెప్పలేకున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత చరణ్ ఎవరెవరితో సినిమాలు చేస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం తనకు ధ్రువ వంటి మంచి హిట్ మూవీ ని అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నారనే వార్తలు కొద్దిరోజుల క్రితం రావడం జరిగింది. అలానే నానితో జెర్సీ వంటి ఎమోషనల్ మూవీ తీసి మంచి హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు ప్రచారం అయ్యాయి. అలానే ప్రస్తుతం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ తీస్తున్న వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. 

 

అయితే లేటెస్ట్ గా చరణ్ తదుపరి సినిమా విషయమై ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక పెద్ద హిట్ కొట్టిన ఫేమస్ దర్శకుడు ఒకరు, రెండు రోజుల క్రితం చరణ్ కు ఒక అద్భుతమైన స్టోరీ ని వినిపించడం, అది చరణ్ కు ఎంతో నచ్చి, ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన వెంటనే చేద్దాం అని ఆయనకు మాటిచ్చారని అంటున్నారు. అలానే మరికొందరు యువ దర్శకుల నుండి కూడా ఆయన కథలు వింటున్నారని, ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అయిన మరుక్షణం ఆయన తన తదుపరి సినిమాలను వెంటనే మొదలెడతారని టాక్. ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, మిగతా హీరోల మాదిరిగా చరణ్ కూడా తన నెక్స్ట్ సినిమాల విషయమై గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: