కరోనా తర్వాత హీరోహీరోయిన్లు.. టెక్నీషియన్స్ పారితోషికాలు తగ్గుతాయన్నారు. బడ్జెట్ కంట్రోల్ కాకపోతే కషఅట అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడిదే పనిలో పుష్ప అండ్ టీమ్ ఉంది. బడ్జెట్ తగ్గించే చర్యలో భాగంగా ఐటం గర్ల్ ను మార్చేశారు. కోటి అవుతుందని అంచనా వేసి.. చివరికి 20లక్షలతో సరిపెడుతున్నారట. 

 

కరోనా తర్వాత ఎంత పెద్ద హీరో అయినా.. తగ్గాల్సిందే. బడ్జెట్ కంట్రోల్ పుష్పపై పడింది. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. సౌత్ లోని అన్ని లాంగ్వేజస్ తో పాటు.. హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టే బాలీవుడ్ హీరోయిన్ ను ఐటం గర్ల్ గా అనుకున్నారు. ఇంతలో కరోనా వచ్చి ఐటం గర్ల్ ని మార్చేసింది. 

 

నాన్నకు ప్రేమతో లాంటి సెంటిమెంట్ మూవీ మినహాయిస్తే.. సుకుమార్ సినిమాల్లో ఐటం సాంగ్ కంపల్సరీ. పుష్ప కోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చారట. పాన్ ఇండియా మూవీ కావడంతో.. ఈ ప్రత్యేక గీతాన్ని దిశాపటానీతో చేయించాలనుకున్నాడు దర్శకుడు. బన్నీకి తొలి హిందీ సినిమా కావడంతో.. దిశా పటానీతో క్రేజ్ పెరుగుతుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్. అయితే బడ్జెట్ కంట్రోల్ చేసేందుకు దిశా పటానీ ప్లేస్ లో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ను తీసుకుంటున్నారట. 

 

తమన్నా.. శృతి హాసన్ లాంటి తెలుగు స్టార్స్ ఐటం సాంగ్ కోసం 40 నుంచి 50లక్షలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన దిశా పటానీ కోటి.. అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసినా.. ఆశ్చర్యం లేదు. బడ్జెట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం కరోనా కల్పించడంతో.. 10..20 లక్షలిస్తే.. ఐటం సాంగ్ చేసే పాప కోసం చూసింది చిత్ర యూనిట్. ఇందులో పాయల్ నటిస్తుందన్న ప్రచారం నడుస్తోంది. చేతిలో సినిమాల్లేని పాయల్.. పాన్ ఇండియా మూవీలో ఐటం సాంగ్ తో హైలెట్ కానుంది. ఆర్ఎక్స్ 100తో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న పాయల్ కు ఐటం సాంగ్ కొత్తేమీ కాదు. సీత సినిమాతో ఐటం గర్ల్ గా మారింది. 

 

ఐటం సాంగ్ రూపంలో 50.. 60లక్షలు ఆదా చేసిన పుష్ప టీమ్ బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి పెట్టింది. మరి బన్నీ.. సుకుమార్ లాంటి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లకు పారితోషికంలో ఎంత కోత విధిస్తారో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: