మన తెలుగు సినిమా పరిశ్రమకు ముందుగా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన నటుడు రావు గోపాలరావు మొదట్లో అక్కడక్కడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఏదో సినిమాలు అయితే చేస్తూ పోతున్నారు తప్ప ఆశించిన రేంజ్ లో గుర్తింపు వచ్చే పాత్ర మాత్రం ఆయనకు దక్క లేదు. అయినప్పటికీ ఏ మాత్రం కృంగిపోని రావుగోపాల రావుకు సరిగ్గా 1975లో దిగ్గజ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాలో మెయిన్ విలన్ గా అవకాశం రావడం జరిగింది. రిలీజ్ తరువాత అనూహ్యంగా ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో పాటు అందులో రావుగోపాల రావు పోషించిన కాంట్రాక్టర్ పాత్రకు ఎంతో మంచి పేరు దక్కడంతో, అక్కడి నుండి నటుడిగా ఆయనకు వరుసగా అవకాశాలు పెరిగాయి. 
 
IHG
ఆ విధంగా వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన రావుగోపాల రావు, అనతికాలంలోనే అప్పటి స్టార్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించారు. ఆపై ఎన్నో సినిమాల్లో గొప్ప గొప్ప పాత్రల్లో నటించిన రావుగోపాల రావు, ప్రస్తుతం భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ కూడా, ఆయన పోషించిన పాత్రలు మాత్రం ఎప్పుడూ మన మనస్సులో నిలిచిపోతాయి. ఇక ఆయన తనయుడైన రావు రమేష్, తొలిసారిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన సీమసింహం సినిమా ద్వారా నటుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ తరువాత అక్కడక్కడా సినిమాలు చేసిన రమేష్ కు అల్లరి నరేష్, శర్వానంద్ ల కలయికలో క్రిష్ తీసిన గమ్యం సినిమాలోని మాజీ నక్సలైట్ పాత్ర దక్కడం, ఆ పాత్ర చిన్నదే అయినప్పటికీ మంచి గుర్తింపు రావడం జరిగింది. 
 
 
ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న రావు రమేష్, ఒక్కో సినిమాతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు టాలీవుడ్ లో మంచి పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరుని మరింతగా నిలబెడుతూ గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో పాటు కెజిఎఫ్ చాప్టర్ 2లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న రావు రమేష్ రాబోయే రోజుల్లో ఇంకెంతో బాగా మంచి అవకాశాలతో దూసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: