రకుల్ ప్రీత్ సింగ్. పొడుగు సుందరి. వెంకటాద్రీ ఎక్స్ ప్రెస్ లో అడుగుపెట్టి దూసుకువచ్చేసింది అలా. ఆ తరువాత చకచకా అగ్ర హీరోల సినిమాల్లో చేస్తూ తనకంటూ ఫ్యాన్స్ ని సంపాదినుకుంది. రకుల్ టాప్ రేంజి హీరోల పక్కన నటించినా కూడా ఆమె ఇమేజ్ మాత్రం పెరగలేదు. స్టార్ హీరోయిన్ స్టాటస్ ఇలా దక్కిందో లేదో అలా రకుల్ టాలీవుడ్ నుంచి డిస్ అపియర్ అయింది. ఇంతకీ గ్లామర్ షో మాత్రమే రకుల్ చేసిందని పేరు తెచ్చుకుంది.

IHG

కెరీర్లో ఎన్నో సినిమాలు చేశానన్న శాటిస్ఫాక్షన్ అయితే ఉంది కానీ సరైన పాత్ర పడలేదాన్న అసంత్రుప్తి మాత్రం బాగా ఉందని ఇపుడు దిగాలు పడుతోంది రకుల్. తనకు మంచి పాత్ర ఇస్తే ఇపుడున్న అనుభవంతో పండిస్తాను అంటోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతున్న వేళ తనకు గ్లామర్ కంటే గ్రామర్ విలువ ఏంటో తెలిసింది అని కూడా అంటోంది. అందువల్ల తనకు సరైన పాత్ర కావాలని ఈ అందగత్తె కోరుకుంటోంది.

IHG

జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర ఏదైనా తనకు దక్కితే బాగుండును అని కూడా అంటోంది. అయితే రకుల్ కెరీర్ టాలీవుడ్ లో దాదాపుగా మసకబారింది. ఆమె నాగార్జున వంటి సీనియర్ హీరోతో మన్మధుడు టూ లో వేసింది. ఆ తరువాత ఆమె కెరీర్ అలా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక సౌత్ లోని మిగిలిన భాషల్లో కూడా రకుల్ కి ఇపుడు చాన్సులు లేవు.

IHG

దాంతో బాలీవుడ్లోనే ఆమె లక్ చెక్ చేసుకోవాలనుకుంటోంది. అక్కడ కూడా పెద్దగా లేవు కానీ ఒకటి రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. మరి అక్కడ ఒక వెలుగు వెలిగితే మళ్లీ టాలీవుడ్ పిలుస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా రకుల్ డ్రీంస్ నెరవేరుతాయా లేక కలగానే ఉండగానే సినీ ఫీల్డ్ నుంచి తప్పుకుంటుందా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: