కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోయిన విషయం తెలిసిందే. కరోనా రోజురోజుకూ పెరుగుతుండటంతో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ థియేటర్లు ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు సినిమా హళ్ళకు వెళ్ళి మరీ సినిమా చూసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఎలాంటి పరిస్థితి ఉన్నా థియేటర్‌కు వెళ్ళి చూడాలనుకునే సినిమా మాత్రం ఒకటి ఉంది. అదే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో...దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.

ఎప్పుడు సినిమాలని మూడు, నాలుగేళ్ళు తీసే రాజమౌళి...ఆర్‌ఆర్‌ఆర్ సినిమాని త్వరగానే విడుదల చేద్దాం అనుకున్నారు. వాస్తవానికి జూలై 30 2020లో సినిమా రిలీజ్ చేయాలని చూశారు. కానీ హీరోలకు చిన్న చిన్న గాయాలు కావడం, మధ్యలో రాజమౌళి కొడుకు పెళ్లి జరగడంతో షూటింగ్‌ల్లో ఆలస్యం జరిగింది. దీంతో ఏ సమస్యా లేకుండా జనవరి 8, 2021లో విడుదల చేస్తామని రాజమౌళి మీడియా ముందుకొచ్చి అధికారికంగా ప్రకటించారు.    

దీంతో తారక్, రామ్ చరణ్‌ అభిమానులు బాగా నిరాశకు గురయ్యారు. ఇక ఎంత నిరాశకు గురైన తప్పదు కాబట్టి, మళ్ళీ జనవరి 8 వరకు వెయిట్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కరోనా దెబ్బకు ఆ ఆశలు కూడా సన్నగిల్లాయి. గత మూడు నెలల నుంచి షూటింగ్‌లు జరగడం లేదు. పైగా ఈ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌లు ఎప్పుడు జరుగుతాయో? సినిమా ఎప్పుడు పూర్తవుతుందో? తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాని మరోసారి వాయిదా వేయనున్నారని ప్రచారం జరుగుతుంది. జూలై 30, 2021లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.    

ఇక 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నా..ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్‌లు కీలక పాత్రలు పోషిస్తుండగా ఎం‌ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, డి‌వి‌వి దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: