మహమ్మారి కరోనా వైరస్ వల్ల సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా వేసవి సీజన్ స్టార్ట్ అవుతుండగా ఈ మహమ్మారి కరోనా రావటంతో ఒక్కసారిగా రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం పెండింగ్ లో పడిపోయాయి. దీంతో రిలీజ్ కావాల్సిన సినిమాల నిర్మాతలు వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ప్రజెంట్ నెలకొంది. అలా రిలీజ్ కావాల్సిన సినిమాల లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ కూడా ఉంది. ఈ సినిమాలో నానితో పాటు హీరో సుదీర్ కూడా నటించడం జరిగింది.

 

పెద్ద సినిమాగా సినిమా థియేటర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు ఓటీటీ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ కలిగిన సినిమాలు ఇప్పటికే ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ‘వి’ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న, ఈ సినిమా నీ రిలీజ్ చేయకుండా థియేటర్ లు ఓపెన్ అయ్యాకే  రిలీజ్ చేయాలని దగ్గర పెట్టుకుంటే వడ్డీలు మీద వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుందని నిర్మాత భావిస్తున్నాడట.

 

అసలు కరోనా వైరస్ వచ్చిన టైములో స్టార్టింగ్ లో థియేటర్ల ఓపెనింగ్ పరిస్థితి పై దిల్ రాజు కి డౌట్ వచ్చిన వెంటనే ‘వి’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినా నాని అలా వద్దు థియేటర్లు ఓపెన్ అయ్యాకే రిలీజ్ చేద్దామని అడ్డు పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా ఎఫెక్ట్ భయంకరంగా ఉండటంతో థియేటర్లు ఈ ఏడాది ఓపెన్ అయ్యే అవకాశం లేని తరుణంలో నాని కూడా ఓటీటీలో 'వి' సినిమాని రిలీజ్ చేయటానికి నిర్మాత దిల్ రాజుకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: